E-Paper
Advertisement

Horoscope  Today January 20th : ఆ రాశి వారు ఈరోజు  ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు.

Horoscope  Today January 20th : ఆ రాశి వారు ఈరోజు  ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు.

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 20న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఈరోజు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు  విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు  దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు  గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలు రాజీ చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు, లాభాలు పొందుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచిబయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×