Realme P3 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ త్వరలోనే P సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో భాగంగా రియల్ మీ p3 5G (Realme P3 5G) మొబైల్ ఇండియాలో లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ తాజాగా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతూ టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తన P సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో భాగంగా రియల్ మీ P3 5G మొబైల్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా ప్రో మొబైల్ తో పాటు అల్ట్రా వేరియంట్ తో స్టాండర్డ్ మొబైల్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ సిరీస్ లో రియల్ మీ P3 ప్రో, రియల్ మీ p3 అల్ట్రా మొబైల్స్ రాబోతుండగా తాజాగా వీటి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్స్ RAM + స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో పాటు కలర్ ఆప్షన్స్ కు సంబంధించిన సరికొత్త వివరాలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Realme P3 5G మోడల్ నంబర్ RMX5070తో నోట్ అయ్యింది. అయితే ఇప్పటికి ఈ కంపెనీ లాంఛ్ తేదీని అధికారికంగా వెల్లడించినప్పటికీ.. లీకైన స్పెసిఫికేషన్స్ ఫోన్ త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుపుతున్నాయి. బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రాబోతుంది. ఇందులో కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగులలో అందుబాటులో ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
8GB RAM కాన్ఫిగరేషన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో రాబోతుంది. 128GB, 256GB వేరియంట్స్ లో రాబోతుంది. టాప్ వేరియంట్ 8GB + 256GB వెర్షన్ కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్‌లో రాబోతుందని తెలుస్తుంది. అయితే 8GB + 128GB మోడల్‌లో కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ అనే మూడు కలర్ ఆఫ్షన్ ఉండనున్నాయి.
మోడల్ నంబర్ RMX5032 తో నోట్ అయిన ఈ మెుబైల్ సిరీస్ ఫిబ్రవరి మూడో వారంలో ఇండియాలో లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ Realme P3 Ultra, మోడల్ నంబర్ RMX5030ను కలిగి ఉంది.
ఇక త్వరలోనే హై అండ్ ఫీచర్స్ తో రాబోతున్న ఈ మొబైల్ లాంఛ్ కోసం స్మార్ట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు మిడ్ రేంజ్ మొబైల్స్ ను తన యూజర్స్ కోసం తీసుకువచ్చేస్తున్న రియల్ మీ నుంచి రాబోతున్న ఈ మొబైల్స్ కూడా అందుబాటు ధరల్లోనే ఉండనున్నాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు ధరకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ALSO READ : 2025లో రాబోతున్న యాపిల్ 5 ఐఫోన్స్ ఇవే