Nindu Noorella Saavasam Serial Today Episode : గార్డెన్ లో బాధపడుతున్న ఆరు దగ్గరకు వచ్చిన గుప్తతో నాకున్న ఈ కొంత టైంలోనైనా నేను నా కుటుంబంతో ఉండాలని కోరుతుంది. అయితే సరే కానీ కాశీ నుంచే మనం మా లోకానికి వెళ్లాలని చెప్తాడు గుప్త. సరే అంటుంది ఆరు. ఇంతలో రాథోడ్ వస్తాడు. విచిత్రంగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్తూ ఆరు, గుప్తను చూస్తూ నవ్వుతూ లోపలికి వెళ్తాడు. గుప్త, ఆరు ఆనుమానిస్తారు. ఎప్పుడు లేనిది ఇవాళేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు. మనం కనిపిస్తున్నట్టు మనల్ని చూసి నవ్వుతున్నాడు అనుకుంటారు. లోపలికి వెళ్లిన రాథోడ్ అమర్ ను చూసి గుడ్ మార్నింగ్ సార్ వెహికిల్స్ ఆల్ రెడీ అంటాడు. ఇంతలో మిస్సమ్మ లగేజీ తీసుకుని వచ్చి రాథోడ్ ఈ బ్యాగులు అన్ని కార్లలో పెట్టు అని ఇస్తుంది. రాథోడ్ బ్యాగులు తీసుకుని బయటకు వెళ్తాడు. మనోహరి టెన్షన్ పడుతుంది. అమర్ ప్రాణాలకు తెగించి అయినా ఆరును ఆస్థికలను కాపాడతాడు.
కానీ ఘోర కసితో ఉన్నాడు. ఎలాగైనా అమర్ కు విషయం చెప్పాలి అని మనసులో అనకుంటుంది. ఇంతలో అమర్ అస్థికలు తీసుకుంటుంటే ఏవండి ఆస్తికలు నేను తీసుకొస్తాను మీరు వెళ్లండి అని చెప్పగానే.. అలాగే అమ్మా నాన్నాలను త్వరగా రమ్మని చెప్పు అని వెళ్లిపోతాడు. మిస్సమ్మ అలాగే అంటుంది. బయటకు వెళ్లిన అమర్ వెనకాలే మనోహరి వెళ్తుంది. అమర్ నాకెందుకో ఆ ఘోర మనల్ని అడ్డుకోవడానికి ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది అని చెప్తుంది. ఏమైనా అంటే అని అమర్ అడగ్గానే.. మనల్ని ఆపడానికి పూజలు చేయడం.. తంత్రాలు చేయడం.. మనుషుల్ని తీసుకొచ్చి అటాక్ చేయడం లాంటివి చేయోచ్చు అంటుంది. వాడు ఇప్పటి వరకు నాకు ఎదురుపడలేదు కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి. నువ్వు అన్నట్టు వాడు ఈసారి ఎదురుపడితే వాడి ఆటలు సాగనివ్వను అంటాడు. నాకు తెలుసు అమర్ కానీ ఎందుకైనా మంచిది ఎవరైనా సెక్యూరిటీని తీసుకుందామని చెప్తుంది.
పక్కనే వింటున్న రాథోడ్ మీకంతా ప్రాణభయంగా ఉంటే ఇంట్లోనే ఉండిపోండి.. అంటాడు. నువ్వేంటి అలా మాట్లాడావు అని మను అడగ్గానే.. ఎలా మాట్లాడాను మనోహరి గారు. ఘోరాకు మీరు భయపడి మా సారును కూడా భయపెడుతున్నారా..? అంటాడు. ఇంతలో ఇంట్లోంచి అందరూ వస్తారు. మిస్సమ్మ వచ్చి ఏవండి ఇక మనం బయలుదేరుదామా..? అనగానే.. అందరూ వెళ్లి కార్లు ఎక్కుతుంటే.. మిస్సమ్మ వెంటనే ఆరు అక్కా ఫోటో మర్చిపోయాను.. తీసుకొస్తాను అంటూ ఇంట్లోకి వెళ్తుంటే.. మనోహరి ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. మనోహరి టెన్సన్ పడుతుంది. ఇంతోల బ్యాగ్ తీసుకుని మిస్సమ్మ రావడంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. చెట్టు చాటు నుంచి అంతా గమనిస్తుంది ఆరు. తర్వాత అందరూ బయలుదేరుతారు. కారులో వెళ్తుంటే మనోమరి టెన్షన్ పడుతుంది. ఆ ఘోర ఎటువైపు నుంచి వస్తాడో అని భయపడుతుంది.
అనవసరంగా వాడిని నమ్ముకుని తప్పు చేశాను అనుకుంటుంది. ఏంటి మనోహరి అంతలా టెన్షన్ పడుతున్నావు అంటూ శివరాం అడుగుతాడు. కారు ఎక్కిన్నప్పటి నుంచి బయపడుతున్నావేంటి అంటుంది. నిర్మల. ఏం లేదని చెప్తుంది మనోహరి. వెనక కారులో ఉన్న మిస్సమ్మ అదేంటండి రాథోడ్ అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడేంటి అంటుంది. ఏమో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటాడు అమర్. ఇంతలో రాథోడ్ రూట్ మారుస్తాడు. ఎవండి ఎయిర్ ఫోర్ట్ కు వెళ్లేది ఇటు కదా రాథోడ్ అటు వెళ్తున్నాడేంటి అంటుంది మిస్సమ్మ.. ఏమైనా షార్ట్ కట్‌లో వెళ్తున్నాడా..? అనగానే ఏమో నాకు చెప్పకుండా రూట్ మార్చడు అంటాడు అమర్. కారులో ఉన్న మనోహరి కూడా రాథోడ్ ఏయిర్‌ఫోర్ట్ కు అటు కదా వెళ్లేది ఇటు వెళ్తున్నావేంటి అనగానే.. రామ్మూర్తి కూడా ఎక్కడికి వెళ్తున్నావు రాథోడ్ అంటాడు. అయినా వినకుండా.. పలకకుండా డ్రైవ్ చేస్తుంటాడు. వెనకాలే వస్తున్న ఆరు, గుప్త కూడా ఆశ్యర్యపోతారు. ఇంతలో మిస్సమ్మ రాథోడ్‌కు ఫోన్ చేస్తుంది. రాథోడ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. కారులో ఉన్నవాళ్లంతా కంగారుపడుతుంటారు.
వెంటనే మిస్సమ్మ మనోహరి కాల్ చేసి రాథోడ్ కారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడగ్గానే.. ఏమో అర్తం కావడం లేదు. రాథోడ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది. దీంతో అమర్ కారు స్పీడు పెంచి రాథోడ్ ను ఓవర్ టేక్ చేస్తాడు. కారు ఆపి వెళ్లి రాథోడ్‌ను పట్టుకోగానే రాథోడ్ అమర్ గొంతు పట్టుకుని పైకి ఎత్తి చెట్టుకు వేలాడదీస్తాడు. అందరూ భయంతో వణుకుతుంటారు. ఆరు భయంతో ఏమైంది గుప్త గారు రాథోడ్ కు ఏమైంది అని అడుగుతుంది. ఆ ఘోర విధ్వంసం మొదలైందని చెప్తాడు గుప్త..
ఇంతలో అక్కడికి ఘోర వస్తాడు. నీ ఇంటి మనిషి రాథోడ్ ఇలా అయ్యాడేంటని ఆందోళన పడుతున్నావా..? దానికి కారణం నేనే అంటాడు ఘోర. ఇంతలో రాథోడ్ కిందపడిపోతాడు. నాకు కావాల్సింది ఒక్కటి మీ దగ్గర ఉంది. నాకు కావాల్సింది నాకు ఇస్తే నేను వెళ్లిపోతా..? నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా..? నాకు కావాల్సింది ఆ ఆస్థికలు అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆరు భయంతో ఘోర ఏమైనా చేస్తాడేమో మీరే ఏదైనా చేయండి అని గుప్తను అడుగుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?