E-Paper
Advertisement

Horoscope  Today January 21st : ఆ రాశి వారికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి

Horoscope  Today January 21st : ఆ రాశి వారికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 21న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంతాల బంధువులు నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు బంధువులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకొంటారు.

సింహ రాశి: ఈ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఈరోజు అతి కష్టం మీద ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు.

కన్యా రాశి: ఈ రాశి  ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి  ఉపశమనం  కలుగుతుంది. సంతానం విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజి చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు  వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయమై శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు  నూతన వ్యాపారాలు పెట్టుబడులకు తగిన లాభాలు  పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి తొలగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు  ఎదురైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ధనాదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. జీవిత భాగస్వామితో విహార యాత్రలో పాల్గొంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×