Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఎందుకంటే… సౌత్ ఆఫ్రికా t20 లీగ్ 2025 టోర్నమెంటులో… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) దారుణంగా విఫలమవుతున్నాడు. ఏ ఒక్క మ్యాచ్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు ఈ డేంజర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ). సౌత్ ఆఫ్రికా టి20 టోర్నమెంటులో… డర్బన్స్ సూపర్ జెంట్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ).
గత సీజన్లో అద్భుతంగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen )… ఈ సారి మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో… దారుణమైన ప్రదర్శన కనబరిచాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ). మొదటి మ్యాచ్లో 10 బంతులు ఆడిన క్లాసిన్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఐదు బంతులు ఆడిన హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక తదుపరి మ్యాచ్లో 17 బంతులు ఆడి 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక చివరి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. దీంతో ఈ టోర్నమెంట్ లో.. ఫెయిల్యూర్ ఆటగాడిగా మిగిలిపోతున్నాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ).
ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో ( South Africa SA20 League )… 2023 అలాగే 2024 సీజన్ లో హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ). 2023 సీజన్ లో… 44 బంతుల్లోనే 104 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ సమయంలో ప్రిటోరియ క్యాపిటల్స్ జట్టు పైన… రెండవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 2024 టోర్నమెంటులో… ప్రతి మ్యాచ్ లో దుమ్ము లేపి అందరిని ఆకట్టుకున్నాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ). ఈ తరుణంలోనే 2024 సీజన్ ఆఫ్ ద అవార్డు కూడా… డేంజర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) గెలుచుకోవడం జరిగింది.
అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో కూడా అద్భుతంగా రాణించాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ). 2023 ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు జట్టు పైన అద్భుతంగా రానించి సెంచరీ సాధించాడు క్లాసన్. బెంగళూరు జట్టు పైన 51 బంతుల్లో 104 పరుగులు చేసి ఐపిఎల్ లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే… ఐపీఎల్ మెగా వేలంలో… హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen )ను వదిలి పెట్టుకోకుండా హైదరాబాద్ జట్టు అంటిపెట్టుకుంది. అంతేకాదు రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 23 కోట్లు పెట్టి హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen )ను కావ్య పాప సొంతం చేసుకుంది.
Also Read: Yograj Singh: పెళ్ళాలు ఎందుకు దండగా..? టీమిండియా ప్లేయర్లపై యోగరాజ్ ఫైర్!
విరాట్ కోహ్లీ 21 కోట్లు పలికితే… ఆ రికార్డును హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) బ్రేక్ చేశాడు. ఈసారి కూడా.. హైదరాబాద్ జట్టు తరుపున ఆడబోతున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో హెన్రిచ్ క్లాసెన్… వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ( Kavya Maran ) భయపడిపోతున్నారు. 23 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే… హెన్రిచ్ క్లాసెన్ ప్రస్తుతం సరైన ఫామ్ లో లేడని… ఐపీఎల్ లో సరిగ్గా ఆడతాడో లేడోనని టెన్షన్ పడుతోందట కావ్య పాప. ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ (SRH ) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా 23 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ పై కుమ్మరించారని… ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Heinrich Klaasen isn’t having the best of SA20 2025 season with the bat so far.#HeinrichKlaasen #SA20 #SouthAfrica #DSG #CricketTwitter pic.twitter.com/IU9v4Jen3w
— InsideSport (@InsideSportIND) January 20, 2025