BigTV English

Horoscope Today January 25th: ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Horoscope Today January 25th: ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 25న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణ దాతల నుంచి ఒత్తిడి  అధికమవుతుంది.

వృషభ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల ఉండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.  చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం, విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

కన్యా రాశి : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తులా రాశి : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు  ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహో ద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు  వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ యత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Bad Karma: చెడు కర్మలు తొలగి కోట్లు సంపాదించాలా..? అయితే ఈ దానాలు చేయండి

Devotional Tips:  ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే

Chanakya niti: చాణక్య నీతి – ఆ ఐదు లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Big Stories

×