BigTV English

Nindu Noorella Saavasam Serial Today January 25th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోయదొర వేషంలో వచ్చిన చిత్రగుప్తుడు –  అంజును తీసుకెళ్లేందుకు రణవీర్‌ ప్లాన్‌ 

Nindu Noorella Saavasam Serial Today January 25th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోయదొర వేషంలో వచ్చిన చిత్రగుప్తుడు –  అంజును తీసుకెళ్లేందుకు రణవీర్‌ ప్లాన్‌ 

Nindu Noorella Saavasam Serial Today Episode :  మిస్సమ్మను కొద్దిదూరం తీసుకెళ్లాక ఒక దగ్గర ఆపేస్తాడు. బైక్‌ దిగిన మిస్సమ్మ ఇక్కడేనా షూటౌట్‌ నాకు గన్‌ అంటే భయం లేదు.. కానీ అందులో ఉన్న బుల్లెట్‌ అంటేనే భయం అంటూ ఏడుస్తుంది. దీంతో ఏయ్‌ లూజ్‌ నేను చెప్పేది ఏంటంటే.. అని అమర్‌ ఏదో చెప్పబోతుంటే.. ఓ షూటౌట్‌ కాదా..? ఓకే నేను రెడీ అంటుంది మిస్సమ్మ.. ఏయ్‌ దేనికి రెడీ అంటాడు అమర్‌. అదే పిల్లలకు ఇంట్లో పుషప్‌ చేయించారు కదా. అంటూ మిస్సమ్మ వార్మప్‌ చేస్తుంది. దీంతో అమర్‌ బైక్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లబోతుంటే.. ఆగండి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అని అడుగుతుంది. నీకు బుల్లెట్‌ నడపడం అంటే ఇష్టం అట కదా..? అందుకే నేర్పిద్దామని తీసుకొచ్చాను అంటాడు అమర్‌.


షాక్‌లో మిస్సమ్మ ఏవండి మీరు చెప్పింది నాకు ఏమీ వినిపించలేదు మళ్లీ చెప్పండి అంటుంది. నీకు బుల్లెట్ నేర్పిద్దామని తీసుకొచ్చానని చెప్పాను కదా అంటాడు అమర్. ఆ విషయం నువ్వు ముందే చెప్పి తీసుకొస్తే బాగుండు కదా..? అని మిస్సమ్మ చెప్పగానే.. నీ బుర్రలో ఇన్ని దారుణమైన ఆలోచనలు ఉన్నాయని నాకెలా తెలుసు అంటాడు అమర్‌. వచ్చి బండి ఎక్కు .. ఒక్కనిమిషం నీ స్కూటీ లాగా మనుషుల మీదకు కాకుండా.. రోడ్ల మీద నడుపు అంటాడు అమర్‌. దీంతో ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. తర్వాత బండెక్కి స్టార్ట్‌ చేయడానికి మిస్సమ్మ ఇబ్బంది పడుతుంటే.. అమర్‌ స్టార్ట్‌ చేసి బండి వెనకే కూర్చుని నేర్పిస్తాడు.

రణవీర్‌ కోర్టు నోటీసులు చూస్తూ కూర్చుని ఉంటే.. లాయర్‌ వచ్చి నువ్వు నీ కూతురుని కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా నీ ఆస్తులన్నీ ట్రస్ట్‌ పేరు మీదకు ట్రాన్స్‌ ఫర్‌ చేయమని కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి అని చెప్తాడు. దీంతో రణవీర్‌ కోపంగా నోటీసులు చించి వేస్తూ .. ఎవరి ఆస్తి ఎవరికి పంచిపెడుతున్నారు. ఈ రణవీర్‌ అంటే ఎవరనుకున్నారు. ఆ ఆస్థి కోసం ఇన్నేళ్లు రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే ఆస్థిని ఎవరి పేరునో ఎలా రాస్తారు అంటాడు. దీంతో లాయర్‌ ఇది నా చేతుల్లో పని అయితే నేను కచ్చితంగా చేస్తానని నీకు తెలుసు. కానీ నీ కూతురు లేకుండా ఏ లాయరు, ఏ చట్టం నీ ఆస్తి నీకు దక్కేలా చేయలేరు అని చెప్తూ.. అయినా నీ కూతురు మనోహరి దగ్గర లేదని అనాథ శరణాలయంలో వదిలేసింది అని తెలిసినా కూడా ఆ మనోహరిని ఎందుకు ఏమీ అనడం లేదు అంటాడు లాయర్‌.


నా ఆస్థి నా పేరు మీద మారేవరకు ఆ మనోహరి బతికే ఉండాలి లాయరు. ఎప్పుడైనా ఎక్కడైనా మనోహరి అవసరం ఉండొచ్చు.. అయినా ఇప్పుడు మనోహరి సమస్య కాదు. నా ఆస్తి అంటాడు రణవీర్‌. దీంతో నీ కూతురిని తీసుకొస్తే ఆస్థిలొ చిల్లిగవ్వ కూడా ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను అని లాయర్‌ చెప్పగానే.. అయితే లాయరు.. నా కూతురు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా..? అనగానే.. అదంతా సులువు కాదు ఆ అమ్మాయికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేస్తారు. పోలీసుల, లాయర్లు ప్రశ్నిస్తారు. నీ కూతురుగా వచ్చే పాప చాలా స్టేబుల్‌ గా ఉండాలి అని లాయరు చెప్పగానే.. రణవీర్‌కు అంజు గుర్తుకు వస్తుంది. లాయరు నా కూతురు వస్తుందని ఈ నోటీసుకు ఒక స్టే తీసుకో అని చెప్తాడు. ఎలా అని అడగ్గానే.. అమరేంద్ర చిన్నకూతురు అంజలి ఉంది కదా..? అంటాడు రణవీర్‌. అమరేంద్రను దాటి అమ్మాయిని ఎలా తీసుకొస్తావు అని లాయరు అడుగుతాడు. తీసుకొచ్చేది నేను కాదు మనోహరి అని రణవీర్‌ చెప్తాడు.

మరోవైపు మిస్సమ్మకు అమర్‌ బైక్‌ నేర్పిస్తుంటే.. మనోహరి వచ్చి చూస్తుంది. అమర్‌ ఎందుకు దీనికి ఇంత కనెక్ట్‌ అయ్యాడు అని బాధపడుతుంది. ఆ ముసలోడు ఏమైనా హామీ తీసుకున్నాడా..? అని తిట్టుకుంటుంది. దీని అక్కని అమర్‌కు దూరం చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈసారి అమర్‌ దీనికి దగ్గర అయ్యాడంటే ఇక నాకు ఎప్పటికీ దగ్గర కాలేడు. దాని ముఖంలో సంతోషం ఉండకూడదు. అని తిట్టుకుంటుంటే.. రణవీర్‌ ఫోన్‌ చేస్తాడు. నా కూతురు కావాలని.. నా కూతురుని కోర్టులో ప్రోడ్యూస్‌ చేయకపోతే.. నా ఆస్తి నాకు ఎప్పటికీ రాదు అందుకే నాకు ఒక కూతురు కావాలి అని చెప్తాడు. అలాంటి అమ్మాయి ఇప్పటికి ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని అడుగుతుంది మనోహరి. దీంతో దొరుకుతుంది అంజలి.. నా కూతురుగా నటించడానికి నాకు అంజలి కావాలి అని చెప్తున్నాను. నేను వెంటనే హైదరాబాద్ వస్తున్నాను. ప్లాన్‌ తో ఆలోచించి రెడీగా ఉండు అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

చిత్రగుప్తుడు కోయదొర వేషం వేసుకుని అమర్‌ వాళ్ల ఇంటికి వస్తాడు. గార్డెన్‌లో ఉన్న ఆరును చూసి నవ్వుతూ వెళ్తాడు. శివరాం వచ్చి కోయదొరను వెళ్లగొడుతుంటే.. నిర్మల వచ్చి ఆయన్ని నేనే పిలిచానని మన పెద్దకోడలు ఇక్కడే ఉందని చెప్పారు కదా..? ఆయనతో మాట్లాడించవచ్చేమోనని పిలిపించాను అంటూ లోపలికి తీసుకెళ్తుంది. మీ కష్టం ఏంటో చెప్పమని చిత్రగుప్తుడు అడగ్గానే.. నువ్వేం చెప్తావు అని ఆరు అడుగుతుంది. నేను చెప్పేది చెప్తాను అనగానే.. ఆరు షాక్‌ అవుతుంది. ఇంతలో నా కోడలు ఎక్కడుంది అని నిర్మల అడగ్గానే.. ఇదిగో ఈడనే ఉంది అని చెప్తాడు దీంతో  అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×