ICC Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే అన్ని దేశాల జట్లను ప్రకటించుకున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి… మార్చి 9 వ తేదీ వరకు చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. హైబ్రిడ్ మోడల్ లో జరగబోయే ఈ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటుకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో… టికెట్లు ఆన్లైన్లోకి తీసుకురావడంపై కీలక ప్రకటన వచ్చింది.
Also Read: ICC Year List: ఐసీసీ క్రికెటర్స్ ఆఫ్ ద అవార్డు లిస్ట్ ఇదే.. బుమ్రా, స్మృతి మందానకు చాన్స్
ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్ ట్రోఫీ టికెట్లను… మంగళవారం అంటే జనవరి 28వ తేదీ నుంచి అందుబాటులో ఉంచబోతున్నట్లు ఐసిసి పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి అన్నమాట. పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో… ఛాంపియన్ స్టోర్స్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన టికెట్లు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని ఐసీసీ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావాల్పిండి స్టేడియంలో జరిగే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు మాత్రమే మంగళవారం రోజున అందుబాటులోకి వస్తాయి. ఈ మూడు స్టేడియంలో పది మ్యాచ్ లు జరగనున్నాయి. వీటికి సంబంధించిన టికెట్లను మంగళవారం నుంచి బుక్ చేసుకోవచ్చని ఐసిసి ప్రకటన చేసింది.
Also Read:WTC – Pakistan: విండీస్ చేతిలో ఓటమి.. WTC లో అట్టడుగున పాకిస్థాన్ !
అయితే దుబాయ్ వేదికగా జరిగే టీమిండియా మ్యాచ్ ల టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని కూడా ప్రకటన చేసింది ఐసీసీ పాలక మండలి. ఇక మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… ఫైనల్ మ్యాచ్ కంటే నాలుగు రోజుల ముందు… దానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది ఐసీసీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా… ఫిబ్రవరి 20వ తేదీన టీమిండియా మొదటి మ్యాచ్ ఈ ట్రోఫీలో ఆడబోతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది టీమిండియా. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడబోయే రెండవ సెమీ-ఫైనల్ టిక్కెట్లు మధ్యాహ్నం 1:00 GST (2:30 pm IST/ 9:00 am GMT) వద్ద అందుబాటులో ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ వెబ్‌సైట్ ద్వారా మ్యాచ్ టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ టిక్కెట్లు కూడా ఫిబ్రవరి 3 నుంచి పాకిస్తాన్ అంతటా నియమించబడిన TCS ఎక్స్‌ప్రెస్ కేంద్రాలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి,
ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందు… ఇంగ్లాండుతో రెండు సిరీస్ లు ఆడబోతుంది ఈ టీం ఇండియా జట్టు. 5 t20 మ్యాచ్ లు అలాగే 3 వన్డే మ్యాచ్లు ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్నాయి. ఈ రెండు సిరీస్లు పూర్తికాగానే ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లోకి అడుగుపెడుతుంది టీమిండియా. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి టీం ఇండియా మ్యాచులు ప్రారంభమవుతాయి. ఈ ఛాంపియన్ స్ట్రోఫీ 2025 టోర్నమెంట్లో టీమ్ ఇండియా జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగనుండగా… గిల్ వైస్ కెప్టెన్ గా ఉంటున్నారు.