Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 2న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి
మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
కుంభ రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలున్నాయి.
మీన రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?