Sri Devi : స్వర్గీయ నటి అందాల ధ్రువ తార శ్రీదేవి మన మధ్యన లేకున్నా కూడా ఆమెను గుండెల్లో పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.. ఆమె అందం అభినయంతో, దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఆమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. ఈమె మరణం అందరికి తీవ్ర బాధను మిగిల్చింది. ఆమె ఎలా చనిపోయారు అనేది ఇప్పటికి ఒక చిక్కుముడిలాగే ఉండిపోయింది. అయితే శ్రీదేవికి మద్యం అలవాటు ఉందట. దానివల్ల ఆమె చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆ అలవాటు ఒకరు నేర్పించారనే తెలుస్తుంది. అప్పటి నుంచి ముందుకు బానిస అయ్యింది. ఇంతకీ ఆమెకు మందును అలవాటు చేసిందో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..
తన నటనతో శ్రీదేవి అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కృష్ణ వంటి అగ్ర హీరోలతోనే కాకుండా ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన నాగార్జున, వెంకటేష్ వంటి వారితో కూడా నటించి ఎన్నో ఘన విజయాలను తన సొంతం చేసుకుంది.. అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించింది. అమితాబ్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఘటన ఆమెది. ఆమెతో సినిమాలు చెయ్యడానికి స్టార్ హీరోలు పోటీ పడేవారు. అంటే ఆమెకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి శ్రీదేవి మధ్యానికి బానిస అయ్యింది. ఆ అలవాటు ఆమెకు నేర్పించింది ఒక మహిళ ఆమె వల్లే పూర్తిగా తాగుడుకు బానిసయింది. అదే వ్యసనంతోనే చివరకు మృత్యువు ఒడిలోకి చేరుకుంది..
మద్యానికి బానిస చేసిందేవ్వరు?
శ్రీదేవి ఫుల్ గా మద్యం సేవించి హోటల్ బాత్ టబ్ లో పడి గుండెపోటుతో మరణించింది అనే విషయాన్ని ఇముంది రామారావు ఖండించారు.. ఆమెకు చిన్నప్పటి నుంచే మద్యం సేవించే అలవాటు ఉందని ఆయన అన్నారు. షూటింగ్ టైంలో తనకు ఏదైనా బాధ కలిగితే ఇంటి వద్దకు వచ్చి ఏడిస్తే ఆమె తల్లి ఇతరుల నిద్రకు ఇబ్బంది కలగకూడదని ఆమెకి మద్యం అలవాటు చేసిందని రామారావు వెల్లడించారు. ఆమె ఎంతగా మద్యం సేవించిన కూడా ఎవరికి పెద్దగా తెలియదు. అలాంటి ఆవిడ బాత్ టబ్ లో పడి చనిపోవడం ఏంటి అని ఆయన అన్నారు. కేవలం ఆమె పేరు మీద ఉన్న 200 కోట్ల ఇన్సూరెన్స్ రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఇన్సూరెన్స్ కోసమే పక్కాగా ప్లాన్ చేసి మరి ఆవిడ మరణించేలా చేశారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి ఆమె మరణం మిస్టరినే కావడం విశేషం.. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రీసెంట్ గా జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో కూతురు ఖుషి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.