Nindu Noorella Saavasam Serial Today Episode : ఘోర కోపంగా ఆ అస్థికలు ఎవరు తీసుకెళ్లారు మనోహరి. నేను రాత్రి అసలు ఆ ఇంటికే రాలేదు. అమర్ కంట పడితే నా చావు నేనే కొనితెచ్చుకున్నట్లే కదా అంటాడు. ఘోర మాటలకు మనోహరి షాక్ అవుతుంది. అయిపోయింది అంతా అయిపోయింది. అస్థికలు పోయుంటాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అమర్ నా నిజస్వరూపం తెలుసుకుంటాడు అంటూ భయపడుతుంది. ఆత్మ తీసి ఉండొచ్చు కదా..? అంటాడు ఘోర.. ఆత్మకు స్పర్శ పోయింది కదా ఘోర అంటుంది మనోహరి. ఎవరు తీసి ఉంటారని ఆలోచిస్తుంది మనోహరి. ఆ ఆస్తికలు కానీ దొరక్కపోతే మన ఇద్దరి ప్రయాణం చీకట్లోకే మనోహరి అంటాడు ఘోర.
గుప్త గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ.. బాధపడుతూ.. ఎందుకు ప్రభు నన్ను ఇక్కట్ల పెట్టి ఉంటివి అంటూ బాధపడుతుంటే.. యముడు వస్తాడు. ఏమైందని అడుగుతాడు యముడు. ఏమో ప్రభు అంతా గందరగోళంగా ఉంది. నా దివ్య దృష్టి కూడా పని చేయడం లేదు అని చెప్తాడు గుప్త. దీంతో నువ్వు ఆ బాలికకు చేసిన సాయం వల్లే ఈ శిక్ష.. త్వరలోనే సమసిపోతుందిలే అంటాడు యముడు. అయితే ఆ ఆస్తికలు ఎవరు తీసుకెళ్లారు ప్రభు ఆ ఘోర తీసుకెళ్లాడేమోనని భయంగా ఉంది అంటాడు గుప్త.
ఆస్తికలు ఇల్లు దాటి వెళ్లలేదు. ఇంటిలోనే ఉన్నాయి అని యముడు చెప్పగానే.. గుప్త హ్యాపీగా ఫీలవుతాడు. ఆ ఆస్తికలు తీసింది ఎవరు అని అడగ్గానే చెప్పకుండా యముడు మాయం అయిపోతాడు. ఇంతలో సంతోషంగా ఆరు పరుగెత్తుకొచ్చి నా ఆస్తికలు ఎవరో తీసుకెళ్లారట.. వెంటనే మీ మాయా పేటికను తెరచి ఎవరు తీసుకెళ్లారో చూడండి అని అడుగుతుంది. నా బాధలో నేను ఉంటే మధ్యలో వచ్చి చెడగొట్టావు అంటాడు. ఆస్థికలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది ఆరు. ఇంట్లోనే ఉన్నాయి అని చెప్తాడు గుప్త.
మిస్సమ్మ వంట చేస్తూ.. రాథోడ్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో రాథోడ్ రాగానే కిచెన్ లోకి తీసుకెళ్లి.. నీకు ఏం చెబితే ఏం చేశావు.. మనోహరి ఆస్తికలు ఎత్తుకెళ్లిపోతుంది. అక్కడ కెమెరా పెట్టమని చెబితే కెమెరానే పెట్టకుండా.. ఆస్తికలే తీసుకెళ్తావా..? అని మిస్సమ్మ అడగ్గానే.. నేనెందుకు తీస్తాను నేను తీయలేదు మిస్సమ్మ అంటాడు రాథోడ్. దీంతో ఆస్తికలు నువ్వు కూడా తీయకపోతే ఇప్పుడు అవి ఎవరి చేతులో ఉన్నాయో వాళ్లు ఏం చేస్తున్నారో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని మిస్సమ్మ అనగానే.. అయితే ఆస్తికలు ఎవరు తీశారో ఇప్పుడే వెళ్లి కనిపెడదాం పద మిస్సమ్మ అంటాడు రాథోడ్. ఎలా అని మిస్సమ్మ అడగ్గానే.. నా లాప్ టాప్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అని చెప్పి లాప్ టాప్ తీసుకొస్తాడు రాథోడ్. సీసీటీవీ పుటేజీ ఓపెన్ చేసి చూస్తే అందులో అంజు పాప వచ్చి ఆస్తికలు ఎత్తుకెళ్లినట్టు కనిపిస్తుంది. మిస్సమ్మ, రాథోడ్ షాక్ అవుతారు.
తన రూంలో ఆరు ఆస్తికలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అంజు. అమ్మా అంటూ పిలుస్తుంది. అంజు అమ్మా అని పిలవగానే గార్డెన్‌లో ఉన్న ఆరు అంజు నన్ను పిలిచినట్టు అనిపించింది అని ఆరు లోపలికి పరుగెట్టుకెళ్తుంది. అంజు చేతిలో ఆస్తికలు చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఆనంద్, ఆకాష్, అమ్ము రాగానే ఆస్తికలను దాచిపెడుతుంది అంజు. ఏం దాస్తున్నావు అంజ అని ఆకాష్ అడగ్గానే.. అంజు ఆస్థికలు తీసి చూపిస్తుంది. పిల్లలు ముగ్గురు షాక్ అవుతారు. నాన్నా కనిపించకుండా పోయాయి అన్న ఆస్థికలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి అని అమ్ము అడుగుతుంది.
నైట్ అందరూ పడుకున్నాక నేనే అమ్మ ఆస్తికలు తీసుకొచ్చాను అని చెప్తుంది అంజు. ఆస్తికలు తీసింది నువ్వే అని తెలిస్తే డాడ్ ఎంత కోప్పడతారో తెలుసా అంటాడు ఆనంద్. నేను ఎవ్వరికీ ఇవ్వను ఆస్తికలు నాతో ఉంటే అమ్మ నాతో ఉంటుంది కదా అంటుంది అంజు. దీంతో అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కలిసి అంజును కన్వీన్స్ చేయాలని చూస్తారు. అయినా అంజు వినదు.
దీంతో అంజు చేతిలోంచి ఆస్తికలు లాక్కోవడానికి అమ్ము ప్రయత్నిస్తుంది. ఇద్దరి పెనుగులాటలో ఆస్తికలు కిందపడబోతుంటే అమర్ వచ్చి పట్టుకుంటాడు. అమర్‌ను చూసిన అంజు భయంతో వణికి పోతుంది. వెంటనే ఆస్తికలు అంజుకు ఇచ్చిన అమర్ నాక్కూడా అమ్మను పంపడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. అంతా పక్కనే ఉండి గమనిస్తున్న ఆరు ఏడుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?