E-Paper
Advertisement

Horoscope  Today January 30th: ఆ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి

Horoscope  Today January 30th: ఆ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 30న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది.

మిధున రాశి: ఈ రాశి  నిరుద్యోగులకు ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. రుణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారస్థులకు ప్రభుత్వ సంబధిత ఇబ్బందులు  కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు వస్తాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×