BigTV English

Nani : హీరో నాని ఇన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారా? గ్లోబల్ స్టార్ అయ్యేవాడు..

Nani : హీరో నాని ఇన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారా? గ్లోబల్ స్టార్ అయ్యేవాడు..

Nani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తమ టాలెంట్ తో సత్తాను చాటిన స్టార్ హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ గా ఇప్పుడు పలు సినిమాలను నిర్మిస్తున్నారు.. అలాగే హీరోగా వరుస సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్నాడు నాని.. గతేడాది థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకోవడంతోపాటు భారీగా కలెక్షన్స్ ని అందించాయి.. ఆయన సినిమా వస్తుందంటే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా నేచురల్ గా ప్రతి ఒక్క అభిమానిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇక నాని ఎలాంటి సినిమా చేసిన హిట్ అయిపోతుందనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇదిలా ఉండగా.. గతంలో నాని రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ టాక్ ని అందుకున్నాయి. మరి నాని రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


నాని కెరీర్ ఎలా మొదలైంది..?

తెలుగు ఇండస్ట్రీ లోకి నాని అష్టా చమ్మా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నాడు నాని.. ఆ సినిమా మంచి హిట్ ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస ఆఫర్స్ నాని తలుపు తట్టాయి. అందులో చాలా వరకు హిట్ అవ్వగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భీమిలి కబడ్డీ జట్టు, రైడ్, అలా మొదలైంది వంటి డిఫరెంట్ సినిమాలతో రాజమౌళి కంట్లో పడ్డారు నాని. దీంతో ఈగ అనే డిఫరెంట్ సినిమాతో నాని ని కొత్తగా పరిచయం చేశారు జక్కన్న. అయితే ఈ సినిమా తర్వాత అనేక ఫ్లాపులు మూటగట్టుకున్న నాని మారుతి దర్శకత్వంలో వచ్చిన బలే బలే మగాడివోయ్ సినిమాతో తన హిట్ ట్రాక్ ని మళ్లీ కొనసాగించాడు.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు నాని. చివరిగా సరిపోతా శనివారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు..


నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బాస్టర్ మూవీస్..

నాని హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఒకప్పుడు వర్సెస్ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఆ క్రమంలో ఆయన దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలను నాని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.. నాని కెరీర్లో కూడా ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసి బాధ పడ్డారట. ఆయన రిజెక్టు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయని తెలుస్తోంది. ఇంతకీ నాని రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికొస్తే.. సుకుమారుడు, తడాకా, గుండెజారి గల్లంతయ్యిందే, ఉయ్యాల జంపాల, సుప్రీమ్, ఊపిరి, మహానటి , జాను, శ్రీకారం.. ఇలా ఎన్నో సినిమాలను నాని రిజెక్ట్ చేశాడు. ఇవే కాదు ఇంకా కొన్ని సినిమాలు కూడా లిస్టులో ఉన్నాయి. ఆ సినిమాలన్నీ మంచి టాక్ ని అందుకున్నాయి సినిమాలు హిట్ అయిన తర్వాత నాని ఓ సందర్భంలో తప్పు చేశానని ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు..

ప్రస్తుతం నాని సినిమాల విషయానికొస్తే.. గ తేడాది చివరగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.. ఆ తర్వాత ప్యారడైస్ సినిమాలో నటించనున్నారని తెలిసిందే..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×