Jagapathi Babu : టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ జగపతి బాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లు ఉండరు. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదట్లో హీరోగా వరుస సినిమాలను చేసాడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒక్కో మూవీ తన కెరీర్ కు సన్సెస్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే తన కూతురి విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అసలేం చేశాడో ఒక్కసారి చూసేద్దాం..
జగపతి బాబు ఫ్యామిలీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో పోటీ పడుతూ విలన్ గా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన చేసిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. క్షేత్రం సినిమా తరువాత హీరో పాత్రలకు పులిస్టాప్ పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో కేరాఫ్ గా మారారు. ఒక్కో సినిమాతో తనలోని నటుడుకి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాదు వరుసగా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తున్నాడు.. ఈ మధ్య చేసిన ప్రతి సినిమాకు ఆయనకు బెస్ట్ నటుడుగా అవార్డును అందుకొనేలß ఉన్నాయి. సినిమాల పరంగా దూసుకుపోతున్న జగపతి బాబు కూతురు విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడట. అయ్యో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
Also Read :హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ.. లక్ అంటే ఇదే..
కూతుర్ల గురించి షాకింగ్ కామెంట్స్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కూతుర్ల పెళ్లిళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగపతిబాబు తన కూతుర్ల పెళ్లిళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన పెద్ద కూతురు ఓ అమెరికన్ ని ప్రేమిస్తే మరో మాట ఆడకుండా దగ్గరుండి పెళ్లి చేశారట. పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నాను అంటే అది తన ఇష్టానికే వదిలేసినట్లు చెప్పాడు. ఇక తన చిన్న కూతురికి అయితే తాను పెళ్లి చేయనని చెప్పేసారట జగ్గు భాయ్. ఎందుకంటే పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దులిపేసుకునే స్వార్ధమని చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయం అన్నారు. పిల్లలతో ఫ్రెండ్స్ లా ఉండాలని చెప్పిన ఆయన.. పెద్దయ్యాక వాళ్ళు ఎలా బతకాలన్నది వాళ్లకే వదిలేయాలని అన్నారు.. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జగపతి బాబు పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నారు.