E-Paper
Advertisement

Horoscope Today June 6th: తెలుగు రాశి ఫలితాలు: ఇవాళ రియల్‌ ఎస్టేట్‌ వారికి అనుకోని లాభాలు

Horoscope Today June 6th: తెలుగు రాశి ఫలితాలు: ఇవాళ రియల్‌ ఎస్టేట్‌ వారికి అనుకోని లాభాలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జూన్‌ 6న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం:  వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

వృషభం: సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలువదు.వృధా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సింహం: సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.

కన్య: కొత్త వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

 తుల: మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి.

వృశ్చికం: కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

ధనుస్సు: భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

కుంభం: మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మీనం: సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×