Allu Family : ఈమధ్య ఇండస్ట్రీలోని స్టార్ హీరోల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు తమిళ హీరో సూర్య వేరే కాపురం పెట్టారంటూ నెట్టింట ప్రచారంలో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయంటూ ఓ వార్త ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ హీరో మరెవ్వరో కాదు అల్లు అర్జున్ ( Allu Arjun ).. అదేంటి ఏం జరిగింది..? అల్లు కుటుంబం నుంచి ఎవరు వేరు కాపురం పెట్టారు? అల్లు అరవింద్ గొడవలు అవుతుంటే ఏం చేస్తున్నారు? ఇంతకీ ఈ కుటుంబంలో ఏదైనా వివాదాలు తలెత్తుతున్నాయా? ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? అసలేం జరుగుతుందనేది తెలుసుకుందాం..
అల్లు కుటుంబంలో కాదు.. అక్కడ గొడవలు..?
అల్లు అరవింద్ ( Allu Aravind) కి ముగ్గురు కొడుకులు. అందులో అల్లు శిరీష్ కి ఇంకా పెళ్లి కాలేదు. ఈయన పెళ్లి కోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వయసు దాటిపోతుంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇదంత పక్కన పెడితే గొడవలు ఫ్యామిలీలో కాదట.. అల్లు సొంత ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ లో అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికిబన్నీ వాస్ నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బన్నీ వాసు ( Bunny Vasu) గీత ఆర్ట్స్ నుండి వేరుపడి బన్నీ వర్క్స్ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రొడక్షన్ బ్యానర్ లోనే నెక్స్ట్ సినిమాలను బన్నీ వాసు చేయబోతున్నట్టు సమాచారం.
Also Read : బిగ్ బాస్ 9 వచ్చేస్తుంది.. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు..
బన్నీ వాసు వెళ్లిపోవడానికి కారణం అతనేనా..?
ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. అల్లు అరవింద్, బన్నీ వాసు మధ్య గొడవలు రావడానికి కారణం అల్లు అరవింద్ బంధువే అట.. ఆయన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి అంతా గందరగోళమే ఏర్పడుతుందట. ముఖ్యంగా ఈ బ్యానర్ పై సినిమాలు చేయాలనుకుంటున్నా డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడంలో లేట్ చేయడంతో వాళ్లంతా వేరే బ్యానర్ లో సినిమాలు చేసేందుకు వెళ్లిపోతున్నారని ఓ వార్త వినిపిస్తుంది. ఈ విషయంపై అల్లు అరవింద్ కు బన్నీ వాసు ఎన్ని సార్లు చెప్పిన కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన బయటికి వెళ్లిపోయినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారంది.. మరి దీనిపై అల్లు అరవింద్ కానీ, బన్నీ వాసు కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి..
ఇక అల్లు అర్జున్ ( Allu Arjun ) సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది సెట్స్ మీద ఉంది. త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.. పుష్ప 2 మూవీ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.