E-Paper
Advertisement

Horoscope Today March 11th: ఆ రాశి వారికి ఇవాళ అప్పుల బాధలు తొలగిపోతాయి – విలువైన వస్తువులు గిఫ్టుగా పొందుతారు

Horoscope Today March 11th: ఆ రాశి వారికి ఇవాళ అప్పుల బాధలు తొలగిపోతాయి – విలువైన వస్తువులు గిఫ్టుగా పొందుతారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 11న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

Advertisement

వృషభం: నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

మిధునం: ఉద్యోగస్థులకు స్థానచలనాలు  తప్పవు. ఆకస్మికంగా వృథా ఖర్చులు, ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో  అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

Advertisement

కర్కాటకం: ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం: మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు సమస్యలు ఎదుర్కొంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభ కార్యములకు ధనవ్యయం చేస్తారు.

కన్య: ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమవుతాయి.

తుల: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో, ఉద్యోగంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవమర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు.

ధనస్సు: ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. ఇంట్లో చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం: ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. చేపట్టిన పనులలో కార్య జయం కలుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.

మీనం: ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×