OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితులే కనపడుతుంటాయి. ఈరోజుల్లో చదువులు ఎలా ఖరీదు అయిపోయాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో తల్లిదండ్రులు కూతుర్ని బాగా పేరు ఉన్న స్కూల్లో చదివించాలని చూస్తారు. అయితే ఆ స్కూల్ లో పేరెంట్స్ కూడా బాగా చదివి ఉంటేనే సీటు వస్తుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘హిందీ మీడియం’ (Hindi medium). ఈ బాలీవుడ్ మూవీని సాకేత్ చౌదరి రచించి, దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, భూషణ్ కుమార్‌లు కలసి మడాక్ ఫిల్మ్స్, టి-సిరీస్‌పై దీనిని నిర్మించారు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, సబా కమర్, దిషితా సెహగల్, దీపక్ డోబ్రియాల్ మరియు అమృతా సింగ్ నటించారు. సమాజంలో ఎదగడానికి తమ కుమార్తెను ప్రతిష్టాత్మకమైన ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేర్పించేందుకు, దంపతులు చేసే పోరాటంపై ఈ స్టోరీ తిరుగుతుంది. ఢిల్లీ లో చాందినీ చౌక్, ఆనంద్ లోక్, కరోల్ బాగ్, సంగమ్ విహార్ లలో ఈ మూవీ చిత్రీకరించబడింది. ₹14 కోట్ల నిర్మాణ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ బాలీవుడ్ మూవీ 19 మే 2017న విడుదలైంది. నటీనటుల నటనకు విమర్శకుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹3.22 బిలియన్లను వసూలు చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రాజు, మిథాలీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చాలా కష్టపడి పెద్ద పొజిషన్ కి వస్తారు. ఆ తర్వాత వీళ్లకు ప్రియా అనే ఒక కూతురు కూడా పుడుతుంది. అయితే వీళ్ళు ప్రియాను సిటీ లోనే బెస్ట్ స్కూల్ లో చేర్పించాలనుకుంటారు. ఆతరువాత ఒక విషయంలో వాళ్ళు ఆలోచనలో పడతారు. పిల్లలకు అడ్మిషన్ దొరకాలంటే, అందులో తల్లిదండ్రులు కూడా బాగా చదివి ఉండాలి. పిల్లల కన్నా ముందే తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో తల్లిదండ్రులు కూడా ఇంగ్షీషు లోనే మాట్లాడాలి. అందులో పాస్ అయితేనే పిల్లలకు సీటు కన్ఫామ్ చేస్తారు. అయితే రాజ్ అంతగా చదవలేక పోవడంతో ఒక కోచింగ్ సెంటర్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటాడు. ట్రైనింగ్ తీసుకున్నాక మిథాలీ ఫర్వాలేదనిపించినా, ఈ ఇంటర్వ్యూలో రాజ్ తప్పు వల్ల కూతురికి సీటు రాకుండా పోతుంది. ఆ తర్వాత ఆర్థికంగా వెనకబడిన వాళ్లకి కొన్ని సీట్లు ఉన్నాయని తెలిసి ఆ విధంగా అప్లై చేస్తారు. అందుకోసం వీళ్ళు పేదవాళ్లలాగా నటించడం మొదలు పెడతారు. చివరికి ఆ స్కూల్లో ప్రియాకి సీటు దొరుకుతుందా? సీటు కోసం తల్లిదండ్రులు పడ్డ కష్టాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘హిందీ మీడియం’ (Hindi medium) అనే ఈ మూవీని చూడండి.