E-Paper
Advertisement

Horoscope  Today March 21st: ఆ రాశి వారికి బంధువులతో అకారణ వివాదాలు – చేపట్టిన పనుల్లో అవాంతరాలు    

Horoscope  Today March 21st: ఆ రాశి వారికి బంధువులతో అకారణ వివాదాలు – చేపట్టిన పనుల్లో అవాంతరాలు    
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 21న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

Advertisement

వృషభం: దైవ చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మిధునం: సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో  పదోన్నతులు పెరుగుతాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

Advertisement

కర్కాటకం: బంధు, మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

సింహం: సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.

కన్య: వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూ సంభంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

తుల: ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రుణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూ,వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు: ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణలు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.

మకరం: నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు

మీనం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×