Saree Movie : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఏం సినిమాలంటే అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈ మధ్య తీసుకున్న సినిమాలను చూస్తే కోపడుతున్నారు. అయినా వర్మ తన రూటును మాత్రం మార్చుకోలేదు. ప్రస్తుతం ఈయన శారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు.. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ‘శారీ’ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
తాజాగా శారీ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వర్మ శారీ మూవీ కాన్సెప్ట్ ను రీవిల్ చేశారు. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీ సినిమా కాన్సెప్ట్ అని బయట పెట్టారు. ఆరాధ్య చీరకట్టులో చేసిన ఒక రీల్ చూసి ఆమెను కాస్ట్ చేశాం. ఆమె చేసిన పర్ ఫార్మెన్స్ సూపర్బ్ గా అనిపించింది. సత్య ట్రైన్డ్ యాక్టర్.. వీరిద్దరి కాంబినేషన్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని వర్మ అంటున్నారు.. రాజకీయాలు, సినిమాలు వేరు. ఏపీలో మా ‘శారీ’ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుందని అన్నారు.
ఇక ఆరాధ్య దేవీ కూడా ఈ మూవీ గురించి తన అనుభవాలను పంచుకుంది. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. ఈ సినిమా చేయడం నాకొక వర్క్ షాప్ లా అనిపించింది. అటు హీరో సత్య కూడా బాగానే చేశారని అన్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ విని అందరు షాక్ అవుతున్నారు. వర్మకు చావు తెలివితేటలు ఎక్కువ ఇలాంటి సినిమాలు తీయాలంటే ఆయనకు మాత్రమే సాధ్యమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ చేస్తుంది.. ఏప్రిల్ 4న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.. మరి వర్మ శారీ మూవీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.. ఈ మూవీని డైరెక్టర్ గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు..