Multani Mitti: ముల్తానీ మిట్టిని ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఇది చర్మ సంరక్షణలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని లోతుల నుండి శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఫేస్ ఆయిల్‌ను తొలగించడంలో కూడా ముల్తానీ మిట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్తానీ మిట్టి చర్మానికి నష్టాలను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా ? మీ చర్మం సున్నితంగా ఉంటే.. మీ ముఖంపై ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. మరి వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై స్కిన్:
ముల్తానీ మిట్టి నూనెను గ్రహించడంలో అద్భుతంగా పని చేస్తుంది. కానీ ఇది మీ చర్మంలోని సహజ తేమను కూడా కోల్పోయేలా చేస్తుంది. మీకు పొడి లేదా సున్నితమైన చర్మం ఉంటే.. అది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా ఇది డ్రై స్కిన్ సమస్యను కూడా పెంచుతుంది. ముల్తానీ మట్టి చాలా మందికి సరపోదు. దీనితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోగానే చర్మంపై మంట మొదలవుతుంది. మీకు కూడా ముఖంపై మంటగా అనిపిస్తే, వెంటనే మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి. తర్వాత చల్లని అలోవెరా జెల్ రాయండి.
ముడతల సమస్య:
ముల్తానీ మిట్టిని తరచుగా అప్లై చేయడం వల్ల చర్మం యొక్క సహజ తేమ తగ్గుతుంది. లేదా తొలగిపోతుంది. ఇలాంటి సమయంలో ముఖం సాగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల నుదిటిపై ,కళ్ళ కింద ముడతలు కనిపిస్తాయి. 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ముల్తానీ మిట్టిని వాడకుండా ఉండాలి. లేకపోతే, వృద్ధాప్య సంకేతాలు అకాలంగా పెరగవచ్చు.
జలుబు, దగ్గు:
ఎవరికైనా జలుబు, దగ్గు సమస్య ఉంటే లేదా సులభంగా జలుబు చేస్తే, వారు ముల్తానీ మిట్టికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ముల్తానీ మిట్టికి జలుబుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కాకుండా ఇది జలుబు , దగ్గు సమస్యను కూడా పెంచుతుంది.
ఎండలో బయటకు వెళ్లకుండా ఉండండి:
కొంతమంది ముల్తానీ మిట్టిని ముఖానికి రాసుకుని ఎండలో బయటకు వెళ్తారు. మీరు ఎండలో బయటకు వెళితే.. అది మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీ చర్మానికి అనుగుణంగా ముల్తానీ మిట్టిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మీ చర్మానికి ముల్తానీ మిట్టిని ఉపయోగించండి. మీరు దీన్ని తరచుగా ఉపయోగిస్తే.. మీ చర్మం పొడిబారడానికి కూడా ఇది కారణం కావచ్చు.
తరచుగా వాడకండి:
మీరు ఎక్కువగా ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ వాడుతుంటే వెంటనే దాన్ని వాడటం మానేయండి. ఎందుకంటే దీన్ని రోజూ వాడటం వల్ల ముఖం మీద ముడతలు వస్తాయి. దద్దుర్లు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముల్తానీ మట్టిని ఉపయోగించే ముందు.. తప్పకుండా దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: సన్ స్క్రీన్ ఎందుకు వాడాలో తెలుసా ?
అలెర్జీ :
కొంత మందికి ముల్తానీ మిట్టి వల్ల అలెర్జీ కలిగే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా ఇది దురద, దద్దుర్లు లేదా వాపుకు కారణమవుతుంది. మీ ముఖంపై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. చర్మం చాలా జిడ్డుగా ఉన్నవారు ముల్తానీ మిట్టిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. కొన్నిసార్లు ముఖ రంధ్రాలు మూసుకుపోతాయి. ముఖ్యంగా ఎక్కువసేపు ఉంచితే ఇది బ్రేక్అవుట్లకు దారితీస్తుంది.
సున్నితత్వం:
ముల్తానీ మిట్టి చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి, ఇది మీ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. మీరు దీనిని ఉపయోగిస్తుంటే మీ చర్మాన్ని రక్షించుకోవడానికి తర్వాత సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి.