E-Paper
Advertisement

Horoscope  Today March 24th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఇంటా బయట ఊహించని సమస్యలు

Horoscope  Today March 24th: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఇంటా బయట ఊహించని సమస్యలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 24న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట ఊహించని సమస్యలు పెరుగుతాయి.

Advertisement

వృషభం: దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

మిధునం: ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఇంటాబయట సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

Advertisement

కర్కాటకం: సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం: బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

కన్య: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆదాయానికి మించిన  ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి.

తుల: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ ఉండదు. వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

ధనస్సు: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి.

మకరం: వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కుంభం: వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మీనం: ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×