NTR : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది.. అందుకే ఈ సినిమా మంచి టాక్ అందుకే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు షూటింగ్ని పూర్తి చేసుకుంది ఈ సమ్మర్ కు రిలీజ్ కాబోతుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే..
ఎన్టీఆర్ వంటవాడు..
ఎన్టీఆర్ నిజానికి భోజన ప్రియుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ చికెన్-మటన్ బిర్యానీ అంటే సింగిల్ గా హండీలే లాగించేస్తాడు. అంతేనా మంచి వంటగాడు కూడా. అవును మీరు విన్నది నిజమే ఎన్టీఆర్ ఎంత బాగా తింటాడో అంతకుమించి వంటని కూడా బాగా చేస్తాడు ఆయన ఫ్యామిలీకి మాత్రమే కాదు స్నేహితులకు సన్నిహితులకు కూడా తన వంటని పంచుతుంటాడు. ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే ఎన్టీఆర్ స్వయంగా వంట వండి పెట్టడం ఆయనకు అలవాటు. ఆదివారం వచ్చిందంటే? వంట గదిలోనే ఉంటాడు. అన్నయ్య కళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుని బిర్యానీ రుచి చూపించనిదే ఒప్పుకోడు.. తనకు అన్నయ్య కళ్యాణ్రామ్ అంటే అంత ఇష్టం అందుకే ఆయనను ఎక్కడికి వెళ్లినా వెంటబెట్టుకుని వెళ్తారు వీళ్ళిద్దరిని చూస్తే నిజంగానే రామలక్ష్మణులు భూమి మీద ఉన్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది.
ఇకపోతే ఏ పండగ వచ్చినా ఆ పండక్కి తగ్గట్లు ఎన్టీఆర్ అదిరిపోయే గుమగుమ లాడించే వంటలను తయారు చేస్తారు. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ స్పెషల్ గా రకరకాల నాన్ వెజ్ వంటలు ఏంటి ఆ స్వయంగా వండుతారు ముఖ్యంగా హలీం కోసం అయినా ఎక్కడికి వెళ్ళడు తానే ఇంట్లో స్వయంగా హలీం తయారు చేసి తన స్నేహితులతో కలిసి కూర్చొని తింటారు. పని చేస్తానంటున్నాడు.. ఎన్టీఆర్ ని నలభీమా అనడంలో సందేహం లేదు. అందుకే చాలా మంది ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడతారు..
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే..
ఎన్టీఆర్ ఇటీవల దేవరా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. బాలీవుడ్ లో వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ కానుంది. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది నీల్ మార్క్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. సీ బ్యాక్ డ్రాప్ లో సాగే డ్రగ్స్ మాఫియా స్టోరీ.. ఈ మూవీస్ షూటింగ్ మొదలయ్యి ఎన్టీఆర్ లేకుండా మిగతా పార్ట్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఎవరున్నారని సమాచారం.