E-Paper
Advertisement

Horoscope Today March 26th: ఆ రాశి నిరుద్యోగులకు ఇవాళ శుభవార్తలు – దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది

Horoscope Today March 26th: ఆ రాశి నిరుద్యోగులకు ఇవాళ శుభవార్తలు – దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 26న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

Advertisement

వృషభం: ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం: బంధువులు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

Advertisement

కర్కాటకం: స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట్లో సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బందు మిత్రులతో   అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగతాయి.

కన్య: ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వృశ్చికం: మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

ధనస్సు: చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమపడ్డ ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

మకరం: సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.  పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

మీనం: ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×