E-Paper
Advertisement

Horoscope  Today March 5th: ఆ రాశి వారు ఇవాళ విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Horoscope  Today March 5th: ఆ రాశి వారు ఇవాళ విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 5న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: నిరుద్యోగాలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార, వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.  ఇంట్లో సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.

Advertisement

వృషభం: దైవ చింతన పెరుగుతుంది రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

మిధునం: చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి.  మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి.

Advertisement

కర్కాటకం:  ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారస్తులు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం: సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా  కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: దైవ కార్యక్రమాలకు ధన సాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశాలకు హాజరవుతారు.

తుల: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేదిస్తాయి. స్థిరాస్తి సంబంధిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.

వృశ్చికం: బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం: ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు బంధు వర్గం వారితో మాటపట్టింపులంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

కుంభం: వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ యత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.

మీనం: అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×