Tamannaah : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో జోడి కట్టింది. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవు డ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్న సంగతి ఆ జంట దాచిపెట్టలేదు. మొదట్లో తమ బంధాన్ని గుట్టుగా ఉంచినా తర్వాత ఓపెనైపోయారు.. ఇక పబ్లిక్ గానే ఇద్దరు కలిసి తిరుగుతూ కనిపించారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారని అనుకునేలోపు బ్రేకప్ చెప్పేసింది. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారు కదు.. అసలు బ్రేకప్ ఎందుకు చెప్పుకున్నారో ఒకసారి మనం వివరంగా తెలుసుకొనే పయత్నం చేద్దాం..
వీరిద్దరూ కలిసి ఈవెంట్లకు వెళ్లడం, మీడియా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం చాలానే జరిగాయి. ఇద్దరూ వేర్వేరు అవకాశాలతో కెరీర్ పరంగా చాలా బిజీ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ వర్మ వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న వైనం వరస హిట్లతో కనిపిస్తోంది.. అసలు కారణం ఏంటో తెలియదు కాని ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. లస్ట్ స్టోరీస్ షూటింగ్ సందర్భంగా ఈ ఇద్దరి మనసులు కలిశాయి. తక్కువ టైంలో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ లవ్ స్టోరీ మొదలయ్యాకే విజయ్ వర్మ కెరీర్ ఊపందుకోవడం గమనార్హం. అంతా బాగుందనుకుంటున్న టైంలో కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ లైఫ్ పార్ట్ నర్స్ గా కన్నా మంచి స్నేహితులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్..
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఏ ఈవెంట్ లో కనిపించడం లేదు. విడి విడిగా వెళ్తున్నారని టాక్. ప్రేమ, గాసిప్స్ గురించి పలు సందర్భాల్లో విజయ్ వర్మ, తమన్నాలు పలు సంగతులు పంచుకున్నారు కానీ చూచాయగా తమ రిలేషన్ క్లైమాక్స్ కు వెళ్తోందనే సంకేతం మాత్రం ఇవ్వలేదు.. ఈ బ్రేకప్ పై ఎవరొకరు క్లారిటీ ఇస్తే తప్ప అసలు సంగతి ఏంటి అనేది తెలియక పోవచ్చు.. ఇక తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మహిళా అఘోరాగా తమన్నా తొలిసారిగా నటించిన ఓదెల 2 ఇటీవలే కుంభమేళాలో టీజర్ లాంచ్ జరుపుకుంది. సంపత్ నంది రచన, నేతృత్వంలో నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ కొత్త బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది తమన్నా. జైలర్, స్త్రీ 2 స్పెషల్ సాంగ్స్ తో పాటుగా ప్రత్యేకంగా నటిస్తుందని తెలుస్తుంది. అలాగే తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అంటే ఇక పెళ్లి మ్యాటర్ ను పక్కనపెట్టినట్లే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమన్నా కు మంచి జోడి దొరికిందని అనుకొనేలోపు ఇలా జరగడం పై ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ వార్తల పై ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.