Nindu Noorella Saavasam Serial Today Episode : ఇప్పుడు వస్తున్న ఒక్కో సమస్య నుంచి తప్పించుకోవాలని మనోహరి అనుకుంటుంది. ముందు అంజు నోరు తెరవకుండా చేయాలంటే.. దాన్ని పైకి పంపేయాలి అని అనుకుంటుంది. అందరూ పడుకున్నాక మెల్లగా అంజు రూంలోకి వెళ్తుంది. సారీయే పొట్టి నువ్వెప్పుడు నాకు అనుకూలంగానే ఉన్నావు.కానీ ఉండకూడని ప్లేస్‌లో ఉండి చూడకూడదని నిజాలు చూసేశావు. నేను బతకాలంటే నువ్వు చావాలి. నువ్వేం టెన్షన్ పడకు ముందు నువ్వు వెళ్లు తర్వాత మీ అమ్మను పంపిచేస్తాను. ఇద్దరు ఎం చక్కా పైన కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకోండి అంటూ దిండు తీసుకుని అంజును చంపేయాలని చూస్తుంది.
ఇంతలో మిస్సమ్మ డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది. వెంటనే భయపడిన మనోహరి.. దిండు తీసి అంజు తల కింద పెడుతుంది. దగ్గరకు వచ్చిన మిస్సమ్మ కోపంగా మనును ఏం చేస్తున్నావు మనోహరి అంజు దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మనోహరి అది అంజు దగ్గర ఎవ్వరూ కనిపించలేదు అని చెప్పగానే.. మిస్సమ్మ ఆ అందుకని ఏం చేయడానికి వచ్చావు అని అడుగుతుంది. దీంతో మనోహరి ఏం చేయడానికి వస్తారు. పక్కనే ఉండి చూసుకుందామని వచ్చాను అని చెప్తుంది. అయితే నీ సేవలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేవు బయటకు వెళ్లు అంటుంది మిస్సమ్మ.
మనోహరి గుర్రుగా చూస్తుంటే.. ఏంటి అలా చూస్తున్నావు. నిన్ను నమ్మి స్పృహలో లేని అంజును వదిలుతానని ఎలా అనుకున్నావు వెళ్లు ఇంకొక్కసారి ఇటు రాకు అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో మనోహరి కోపంగా హెల్త్ బాగాలేని అంజును చూసుకోవడం రాదు కానీ నేను వచ్చి చూసుకుంటుంటే నన్ను అంటున్నావా..? నీ ఖర్మ అంటూ మనోహరి బయటకు వెళ్లిపోతుంది. మన బయటకు వెళ్లాక మిస్సమ్మ ఉన్నట్టుండి అంజు మీద మను ఇంత ప్రేమ చూపిస్తుందంటే.. నమ్మబుద్ది కావడం లేదు.. ఏదో ప్లాన్ చేసి వచ్చి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు రణవీర్ ఇంటికి వెళ్లి సీసీటీవీ పుటేజీలో మనోహరిని చూసిన అమర్ బయటకు వచ్చి ఆలోచిస్తుంటాడు. రాథోడ్ ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతాడు. రణవీర్ మాటల్లో తడబాటు.. కళ్లల్లో కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది రాథోడ్ అని చెప్తాడు అమర్. అదేంటో అర్థం కావడం లేదు. ఇందాక అడిగినప్పుడు మనోహరి అసలు ఇక్కడికి వచ్చింది అన్న విషయమే చెప్పలేదు. పైగా పుటేజీలో మనోహరి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు. ఎందుకు అని అడిగితే రణవీర్ దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. ఈ డాట్స్ ను ఎలా కలెక్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు అమర్.
ఇంతలో కాళీ ఫోన్‌కు మంగళ కాల్ చేస్తుంది. అక్కడే ఫోన్ పడి ఉండటంతో అమర్, రాథోడ్ షాక్ అవుతారు. ఇంతలో రాథోడ్ ఎక్కడో ఫోన్ రింగ్ అవుతుంది చూడు అని అమర్ చెప్పగానే రాథోడ్ చూసి రింగ్ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది అని ఫోన్ దగ్గరకు వెళ్లి తీసుకుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మంగళ మాట్లాడటం వింటారు అమర్, రాథోడ్. ఫోన్‌లో మంగళ ఓరే తమ్ముడు రాత్రి నుంచి ఫోన్ ఎత్తడం లేదు తాగి ఎక్కడ పడుకున్నావు అని అడుగుతుంది. అమర్ మంగళ గారు అని పిలవగానే.. మంగళ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే అమర్ ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేస్తాడు. కోపంగా ఇంటికి వస్తాడు.
ఇంటికి వచ్చిన అమర్ రణవీర్, మనోహరిని నిలబెట్టి.. నేను అడగాల్సినవి నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మనోహరి.. నిన్న రణవీర్ ఇంటికి వెళ్లావన్న విషయం మా దగ్గర దాయటం దగ్గర మొదలు పెడదాం.. నిన్న రాత్రి కాళీ లాస్ట్ గా నీతోనే ఫోన్ మాట్లాడాడు.. కాళీ నీకెందుకు ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడిన కాసేపటికి నువ్వు చాలాసార్లు కాళీకి తిరిగి ఫోన్ చేశావు ఎందుకు..? అని అమర్ అడగ్గానే.. మనోహరి షాక్ అవుతుంది. రణవీర్ భయంతో సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?