E-Paper
Advertisement

Horoscope Today May 27th: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

Horoscope Today May 27th: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 27న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంట్లో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Advertisement

వృషభం: కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిధునం: ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Advertisement

కర్కాటకం: ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

సింహం: వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కన్య: ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

ధనస్సు: నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు విషయాలలో శుభవార్తలు పెరుగుతాయి.

మకరం: ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.

కుంభం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

మీనం: చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కొరత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×