Hero Dhanushu: ప్రతి మనిషికి ఏదోక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక తో భవిష్యత్ లో ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. దాన్ని నెరవేర్చుకొనేంతవరకు నిద్రపోరు. ఈ మధ్య అందరు ఇలానే తమ డ్రీమ్స్ ను చేరుకోవాలని అనుకుంటారు. కానీ కొందరి లైఫ్ లో మాత్రం సెలెబ్రేటి హోదా రాసిపెడుతుంది. మొదట్లో ఒకటి అనుకుంటే.. చివరికి మరొకటి జరుగుతుంది. ఇటీవల సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు తమకు చిన్నప్పటి నుంచి మిగిలిపోయిన కోరికలను బయట పెట్టేస్తున్నారు. తాజాగా హీరో ధనుష్ లైఫ్ లో మిగిలిపోయిన కోరికను బయటపెట్టారు. తాను సినిమాల్లోకి రాకుంటే మాత్రం అదే చేసే వాడిని అని చెప్పాడు. ఇంతకీ ధనుష్ సినిమాల్లోకి రాకుంటే ఏమయ్యేవాడో ఒకసారి తెలుసుకుందాం..
ధనుష్ హీరో కాకుంటే ఏమయ్యేవాడు..?
తమిళ హీరో ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ అయ్యాడంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ముందుకు ఓ ఆసక్తికర ప్రశ్న వెళ్లింది.. మీరు హీరో కాకుండా అంటే ఏమయ్యేవారు అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. మరో ఆలోచన లేకుండా మంచి చెఫ్ గా స్టార్ హోటల్ లో ఉద్యోగం చేసేవాడినన్నారు. చిన్న తనం నుంచి వంట అంటే ఇష్టం. వంటల్లో కొత్త కొత్త డిష్లను కనిపెడుతూ అందరి మనసులో చోటు సంపాదించుకోవాలని అనుకునేవాన్ని అంటూ ధనుష్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. చిన్నప్పుడు వంటింట్లో అమ్మ పక్కనే ఉండి వంట చేయడం అలవాటు అయిందన్నాడు. వంట విషయంలో తల్లికి మంచి సహాయకుడిగా ఉండేవాడుట.. ఇప్పటికీ నేను కిచెన్ లో ప్రయోగాలు చేస్తుంటాను అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..
Also Read :ఎవరి దారి వాళ్లదే… భయం వేస్తుంది చూస్తే.. అల్లు అరవింద్‌పై దిల్ రాజు డైరెక్ట్ కౌంటర్..
ధనుష్ సినిమాల విషయానికొస్తే..
ధనుష్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఒక్కో సినిమాలో తన టాలెంట్ నిరూపించుకుంటూ. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని అందుకున్నారు. తమిళ్ తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నే కాదు తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. దాంతో పాటుగా ఈ మధ్య తెలుగులో కూడా సినిమాలు చేయడంతో ఆయనకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. ఆ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..