Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీలల్లో ఒకటి స్పిరిట్.. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ మూవీలో డార్లింగ్ కనిపించడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికన్నా ముందు కమిటీ అయిన సినిమాలు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ మూవీ గురించి రోజుకో వార్త నెట్టింట వినిపిస్తుంది. నిన్నటివరకు హీరోయిన్ కోసం వేట సాగింది. ఇప్పుడు ఏమో స్టోరీ లీకైంది.. అయితే ఈ మూవీ లో అలాంటివి ఎక్కువగా ఉంటాయని ఓ వార్త వినిపిస్తుంది.. ఇందులో నిజంగా అలాంటి సీన్లు ఉన్నాయో లేదో తెలుసుకుందాం..
స్పిరిట్ లో స్పైసి కంటెంట్..?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రొమాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ తో వస్తున్న సినిమాల్లో కూడా అలాగే సీన్స్ ఉంటాయని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ డైరెక్టర్ గతంలో చేసిన యానిమల్ చిత్రంలో కంటెంట్ కన్నా ఎక్కువగా రొమాన్స్ హాట్ సీన్లు ఉండడంతోనే సినిమా హిట్ అయింది అన్న విషయం చాలామందికి తెలుసు. కానీ ప్రభాస్ సినిమాల్లో అలాంటివి చాలా తక్కువ.. స్పిరిట్ లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో ఆమె ఎలా ఫిట్టవుతుందనే ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తే కాని దొరకదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో కూడా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకునే మూవీనే. వయొలెన్స్, రొమాన్స్ లో తనదైన మార్కు చూపించే సందీప్ రెడ్డి వంగా వాటిని ప్రభాస్ సినిమాలో ఇంకా ఎక్కువ డోస్ లో చూపించబోతున్నాడట. అలాంటి సీన్లు ఎక్కువగా ఉండటంతో ప్రభాస్ కూడా ఒకే అని చెప్పాడట.. ఎక్కడ ఎలాంటి సీన్ వస్తుందనేది పూర్తిగా వివరించినట్లు తెలుస్తుంది..
Also Read: హీరో కాకుండా ఉంటే ధనుష్ ఏమయ్యేవాడో తెలుసా..? ఇదేం పిచ్చి భయ్యా..
సందీప్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..
స్పిరిట్ లో ఎలివేషన్లు, పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. పలువురు విదేశీ నటీనటులతో పాటు ఎవరూ ఊహించని ఒక స్టార్ క్యామియో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుందని అంటున్నారు.. అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లూ రాలేదు. కానీ ఈ విషయం గురించి బయటపడితే మాత్రం ఖచ్చితంగా రచ్చ రంభోలానే.. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటల కంపోజింగ్ ని దాదాపు కొలిక్కి తెచ్చినట్టు వినికిడి. స్పిరిట్ సిగ్నేచర్ ట్యూన్ సైతం సిద్ధమయ్యిందట. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వంగా రెడీ.. ఏది ఏమైనా కూడా వంగా ప్లాన్ వేరే లెవల్.. అందుకే డార్లింగ్ నమ్మాడు. ఇక ఎలాంటి స్టోరీని చూపిస్తాడో వెయిటింగ్ అంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.