EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి.చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

వ‌ృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో సవాళ్లను అధికగమిస్తారు. తోటివారి సహకారంతో కీలక పనులు త్వరగా పూర్తవుతాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శ్రీలక్ష్మి గణపతిని ప్రార్థించడం ఉత్తమం.


మిథునం:
మిథునరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో   అనుకున్న పనులు పూర్తవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో కీలక విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆచితూచి నడుచుకోవడం ఉత్తమం. ఆదాయన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా విజయం పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన ముఖ్యమైన పనులను పెద్దల సలహాలతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైనా పని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. అధిక ధన లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

తుల:
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని రంగాల వారు సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్భం శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అన్ని రంగాల వారికి శుభయోగాలు ఉంటాయి. అనవసర విషయాలపై ఎక్కువగా ఆలోచన చేయకపోవడమే మంచిది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాల్లో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో పట్టుదలతో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాల విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్లొంటారు. బంధుమిత్రుల సలహాలు తీసుకుంటారు. నవగ్రహ ధ్యానం శుభదాయకం.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీ మీ రంగాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. గణపతిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. ప్రయాణాలు అనుకూలించవు. అనవసర ఖర్చులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ శుభదాయకం.

మీనం:
మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం డబుల్ అవుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

Related News

Saubhagya Yog Horoscope: మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశంతో ఈ రాశుల వారు రాజభోగాలు అనుభవించబోతున్నారు

Shani Parivartini Ekadashi Upay: ఈ రోజు శని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి

Venus Transit Horoscope: శుక్రుని వల్ల ఈ 3 రాశులకు బంపర్ ఆఫర్ దక్కబోతుంది..

Lucky Zodiac Signs: రెండు రాజయోగాల ప్రభావం.. వీరికి అదృష్టం

Surya Grahan Effect on Rashi : త్వరలో రెండవ సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారి జీవితాలు తలకిందులు కాబోతున్నాయి

Guru Vakri 2024: గురుడి తిరోగమనం.. వీరు అనుకున్నవన్నీ జరుగుతాయ్

Chandra Grahanam: మరో ఐదు రోజుల్లో చంద్రగ్రహణం, ఇది మనదేశంలో కనిపిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలి?

Big Stories

×