BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం డబుల్!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం డబుల్!

Astrology Today: మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరికి కలిసొచ్చే అవకాశం ఉంది వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం బాగానే ఉంటుంది. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి, పనిభారం పెరిగే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తు గురించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన శ్రేయస్కరం.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇష్టదేవతారాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆదాయం డబుల్ ఉంటుంది. పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో కీలక పనుల్లో తోటి వారి సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సమయానికి విశ్రాంతి తీసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. పెట్టుబడులు..లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల:
తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఈశ్వర ఆరాధన శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయ. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఈశ్వర నామస్మరణ ఉత్తమం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేదు. ఆర్థికంగా అర్ధలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో అంతగా ఫలితాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉంటాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సహనంతో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు వరిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు విపరీతమైన లాభాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×