BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్ల అవకాశాలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్ల అవకాశాలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. ఏ రాశి వారికి అనుకూలంగా లేదు వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులకు తగిన సమయం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం:
మిథునం రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పట్టుదల, కృషితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విష్ణుధ్యానం చేయండి.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శివాష్టకం పఠించండి.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. శివాష్టకం పఠించండి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆప్తుల సలహాలు పాటిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×