BigTV English

Olympics: అత్యధిక పతకాలు సాధించిన దేశాల జాబితాలో ఇండియా ర్యాంక్ ఇదే

Olympics: అత్యధిక పతకాలు సాధించిన దేశాల జాబితాలో ఇండియా ర్యాంక్ ఇదే

Olympic Medal Table: పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగిశాయి. దీంతో ఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయనే ఆసక్తి ఏర్పడుతున్నది. ఎప్పట్లాగే అమెరికా అత్యధిక మెడల్స్‌తో ముందుంటుందనే అంచనాలు నిజమయ్యాయి. ఇక చైనా ద్వితీయ స్థానంలో నిలబడింది. గోల్డ్ మెడల్స్‌లో ఈ రెండు దేశాలు సమానంగా 40 చొప్పున గెలుచుకున్నాయి.


40 గోల్డ్ మెడల్స్, 44 సిల్వర్ మెడల్స్, 42 బ్రాంజ్ మెడల్స్‌తో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో నిలబడింది. అమెరికా మొత్తంగా 126 పతకాలు గెలుచుకుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 91 మెడల్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. ఈ దేశం 40 గోల్డ్ మెడల్స్, 27 సిల్వర్ మెడల్స్, 24 బ్రాంజ్ మెడల్స్ సాధించుకుంది. ఇక మూడో స్థానంలో జపాన్ నిలిచింది. 20 గోల్డ్, 12 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌లో జపాన్ థర్డ్ ప్లేస్ ఆక్రమించుకుంది. అమెరికా, చైనాల మధ్య పోటీ ఎక్కువ ఉన్నది.

Also Read: Pawan Kalyan: కష్టాల్లో ఉన్నా.. పవన్ కళ్యాణ్ అండగా నిలవాలి: దివ్వెల మాధురి


ఇక భారత్ విషయానికి వస్తే.. మన దేశం ఈ జాబితాలో 71వ స్థానంలో ఉన్నది. మన దేశం గోల్డ్ మెడల్‌ను వినేశ్ ఫోగట్ పై అనర్హతతో తృటిలో చేజార్చుకుందనే అభిప్రాయం ఉన్నది. ఫలితంగా భారత్ ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేదు. ఒక్క సిల్వర్, ఐదు బ్రాంజ్ పతకాలను సాధింది. మొత్తంగా భారత్ ఆరు పతకాలను ఈ ప్యారిస్ ఒలింపిక్స్‌లో గెలుచుకుంది. ఈ పతకాల జాబితా చూస్తే భారత్ ఒలింపిక్ క్రీడల్లో ఇంకా రాణించాల్సింది చాలా ఉన్నదని అర్థమైపోతున్నది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×