Meditation:ధ్యానం గురించి చాలమంది చెబుతారు. బిజీ లైఫ్ నుంచి కాసేపైనా సాంత్వన కావాలని కోరుకునేవాళ్ళుంటారు. అలాంటి వాళ్లకు దారి చూపే మార్గం ధాన్యం చేయడం మంచి పరిష్కారం. అయితే ధాన్యం ఎలా చేయాలి…ఎంతసేపు అంటే ఆలోచనలు రాకుండా ఉండేంతవరకూ. కొంతైనా శక్తి వచ్చేంత వరకు అయినా చేయాలి. లేదా కొన్నైనా నూతన అనుభవాలు పొందేవరకు చేస్తూ ఉఁడాలి
మైండ్ లో ఉన్న ఆలోచనలు అన్నవి సమసిపోయిన తరువాతే శక్తి అన్నది మనలోకి నూతనంగా ప్రవహిస్తుంది. అలాగే “ఆలోచనలు” అన్నవి మూగబోయిన తరువాతే “అనుభవాలు” అనేవి మొదలయ్యేవి! ఈ ఆలోచనలు అనేవి వారి వారి వయస్సు, వారి వారి పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. వయస్సుతో పాటే ఆలోచనలూ పెరుగుతూ వస్తాయి. అలాగే ఆ వయసు ఇంకా ఇంకా పెరిగేకొద్దీ ఆ ఆలోచనలూ తగ్గుతూ వస్తాయి. కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు వయస్సు ఎక్కువగా ఉన్నపుడు ధ్యాన సమయాన్ని కూడా ఎక్కువ చేయాలి.
40 ఏళ్ల వయసు ఉంటే 40 నిమిషాలు ధ్యానం చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి కనీసం 4 నిమిషాలన్నా “ఆలోచనా రహిత స్థితిలో ఉండగలిగే శక్తి ఉంది. అంటే 40 నిమిషాల ధ్యానంలో మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఏ ఒక సందర్భంలో మాత్రమే కనీస మొత్తం మీద అయిదు నిమిషాల సేపు ఎలాంటి ఆలోచనా లేకుండా నిశ్చలత్వాన్ని పొందగలుగుతాడు. అంటే ‘ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు’ కనీసం చేయాలి. ఈ విధంగా అందరూ ఎవరి వయస్సును బట్టి వారి ధ్యానసాధనను కొనసాగించాలి.
శారీరక మానసిక పరిస్థితులు అధ్వాన్నంగా వుండేవారు, కనీసం రోజుకు రెండు సిట్టింగ్స్ గా ధ్యానం చేస్తుంటే క్రమేణా వారు చక్కటి సత్ఫలితాలను పొందుతారు. మన భారతీయ మహర్షులు అందుకే ధ్యానాన్ని మనుషుల జీవితంలో భాగం చేశారు.