Raksha Bandhan 2025: రాఖీ పండుగ అన్నదమ్ముల మధ్య ప్రేమ, నమ్మకానికి చిహ్నం. దీనిని హిందువులంతా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున అక్కాచెల్లెల్లు తమ సోదరుడి దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు, భద్రతను కోరుకుంటూ రాఖీ కడతారు. ఈ సమయంలో అన్నాదమ్ములు వారికి బహుమతులు ఇవ్వడం ద్వారా సంతోషపరుస్తారు. ఈ సంవత్సరం రాఖీ పండగను ఆగస్టు 9 వ తేదీ శనివారం రోజున జరుపుకోనున్నాము. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే భద్ర దోషం లేదు. అంటే.. రాఖీ కట్టడానికి రోజంతా శుభ సమయంగా పరిగణించవచ్చు.
ఇదిలా ఉంటే.. రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి, రాఖీని ఏ దిశలో కూర్చుని రాశీ కట్టాలి? అనే విషయాలపై చాలా మందికి సందేహం ఉంటుంది. వాటిని తెలుసుకోవడం ద్వారా మీరు ఈ పవిత్రమైన రాఖీ పండగను పండుగను సరైన పద్ధతి, సంప్రదాయం ప్రకారం జరుపుకోవచ్చు.
రాఖీ కట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ?
రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి ?
రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మూడు ముడులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులకు అంకితం చేయబడ్డాయి . ప్రతి ముడితో సోదరుల ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలి. మూడు ముడులు వేయడం వల్ల మీ మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుంది.
ఏ దిశలో కూర్చుని రాఖీ కట్టాలి ?
సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఏదైనా పూజ, ఆచారం లేదా శుభకార్యం చేసేటప్పుడు దిశలను గుర్తుంచుకోవడం అవసరం. ఎందుకంటే సరైన దిశలో కూర్చుని పనిచేయడం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి వ్యాపిస్తుందని నమ్ముతారు. రాఖీ పండగ సందర్భంగా కూడా.. రాఖీ కట్టేటప్పుడు, సోదరుడి ముఖం తూర్పు వైపు ఉండాలని చెబుతారు.
Also Read: మొదటి సారి ఇంట్లో మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ వాస్తు టిప్స్ పాటించండి
సోదరులు తూర్పు దిశకు ముఖం చేసి కూర్చున్నప్పుడు, అతను సూర్యుని సానుకూల శక్తిని పొందుతాడు. తూర్పు దిశను సూర్యోదయ దిశగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రాణశక్తి, కొత్త ప్రారంభాలు, సానుకూల శక్తికి చిహ్నం కాబట్టి ఈ దిశ నుంచి రోజు ప్రారంభమవుతుంది. అంతే కాకుండా ఇది పెరుగుదల, కాంతి, ఆశను సూచిస్తుంది. సోదరులు తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు.. సూర్యుడి సానుకూల శక్తిని పొందుతారు. ఈ దిశలో సోదరి రాఖీ కట్టడం వల్ల.. అతని రక్షణ, శ్రేయస్సు కోసం సంకల్పాలు మరింత శక్తివంతమవుతాయి.
తూర్పు ముఖంగా చేసే పూజ లేదా ఏదైనా శుభకార్యం మరింత ఫలవంతమైనదని మత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. రాఖీ కట్టేటప్పుడు ఈ నియమాన్ని పాటించడం ద్వారా.. సోదరి చేసే ప్రార్థన, రాఖీ యొక్క శక్తి , తిలకం యొక్క ప్రభావం మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఇది సోదరుడికి దీర్ఘాయువు, ఆరోగ్యం, విజయాన్ని అందిస్తుంది.