Scariest Railway Stations: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆహ్లాకరమైన, ప్రకృతి అందాలతో కనువిందు చేసే బోలెడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అదే సమయంలో వింతైన, భయంకరమైన రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని అసాధారణ, భయం కలిగింగే కొన్ని రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైల్వే స్టేషన్లలో ఇండియాకు చెందినవి కూడా ఉండటం విశేషం. ఇంతకీ ఆ స్టేషన్లు ఏవి? ఎందుకు భయంకరమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి?
⦿ టాంగ్గులా రైల్వే స్టేషన్, టిబెట్
ఇది భారత్ కు పొరుగు దేశమైన టిబెట్ లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి ఏకంగా 5,068 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చకుంది. ఈ ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ప్రయాణీకులకు ఆల్టిట్యూడ్ సిక్ నెస్ కు కారణమవుతుంది. అందుకే రైళ్లలో ప్రయాణీకులకు ఆక్సీజన్ మాస్కులను అందిస్తారు. స్టేషన్ చుట్టూ నిర్జనమైన, గడ్డకట్టిన టిబెటన్ ఎత్తైన పీఠభూమి ఉండటం వల్ల ఈ స్టేషన్ భయానకంగా అనిపిస్తుంది. ఈ స్టేషన్ చాలా రిమోట్ గా ఉంటుంది. దాదాపు ఇక్కడ స్థానిక ప్రజలు ఉండరు. ఇది ఒక రకమైన విచిత్రమైన నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందుకే, ఈ రైల్వే స్టేషన్ భయంకరమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ అవోమోరి రైల్వే స్టేషన్, జపాన్
ఈ స్టేషన్ సమీపంలోని సీకన్ సొరంగం ద్వారా హక్కైడోతో లింకై ఉంది. సముద్ర గర్భంలో 240 మీటర్ల లోతులో ఉంటుంది. ఈ సొరంగంలో రైలు ప్రయాణం భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి లోతైన రైల్వే సొరంగం మార్గం ఇదే కాబట్టి. ఈ సొరంగం భూకంప-ప్రమాద ప్రాంతంలో ఉంది. అందుకే, ఈ ప్రాంతంలో ప్రయాణం చేసే సమయంలో ప్యాసింజర్లు భయంతో వణికిపోతారు.
⦿ డడ్లీ పోర్ట్ రైల్వే స్టేషన్, యూకే
ఈ స్టేషన్ రాత్రిపూట నిర్జనంగా, చీకటిగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో రాత్రి పూట దెయ్యాలు తిరుగుతాయని స్థానికులు భావిస్తారు. పాత రైల్వే స్టేషన్ నిర్మాణం, చుట్టూ ఉన్న నీడలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొంతమంది ప్రయాణీకులు ఇక్కడ అసాధారణ శబ్దాలను విన్నట్లు చెప్తారు. అంతేకాదు, రాత్రిపూట ఎవరో తమను తరిమినట్లు చెప్పిన సందర్భాలున్నాయి. అందుకే ఈ రైల్వే స్టేషన్ కూడా భయానక రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది.
Read Also: భారత్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా?
⦿ చెంబూర్ రైల్వే స్టేషన్, భారతదేశం
ఈ రైల్వే స్టేషన్ ముంబై లో ఉంది. ఈ స్టేషన్ సమీపంలోని స్మశానవాటిక ఉంటుంది. రాత్రి వేళ ఆ స్మశానం నుంచి కొన్ని ఆత్మలు వచ్చి ఈ స్టేషన్ లో తిరుగుతాయని స్థానికులు భావిస్తారు. రాత్రి సమయంలో స్టేషన్ చుట్టూ ఉండే చీకటి, నిశ్శబ్దం భయపెట్టే అనుభూతిని కలిగిస్తుందని చాలా మంది ప్రయాణీకులు అంటుంటారు.
Read Also: దేశంలోనే అతి పొడవైన రైల్వే టన్నెల్, అమ్మో అన్ని కిలోమీటర్లా?