Vastu Tips For Money Plant: మనీ ప్లాంట్ కేవలం ఇంటికి పచ్చదనాన్నే కాదు.. సానుకూల శక్తిని, శ్రేయస్సును కూడా తెస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచడం వల్ల ఇంట్లో సంపద, అదృష్టం వృద్ధి చెందుతాయి. మొదటిసారి మనీ ప్లాంట్‌ను మీ ఇంట్లో నాటుతున్నట్లయితే.. కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన దిశ ఎంచుకోండి: ఆగ్నేయం (సౌత్-ఈస్ట్) :
వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఉంచడానికి ఆగ్నేయ దిశ (తూర్పు, దక్షిణాల మధ్య దిశ) అత్యంత అనుకూలమైనది. ఈ దిశకు అధిపతి శుక్రుడు, అంతే కాకుండా ఇక్కడే గణపతి కూడా కొలువై ఉంటాడు. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది, ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. అంతే కాకుండా అదృష్టం కలిసి వస్తుంది.
ఎక్కడ ఉంచకూడదు ?
ఈశాన్యం (నార్త్-ఈస్ట్): మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఈ దిశకు అధిపతి బృహస్పతి, , శుక్రుడికి బృహస్పతి శత్రువు. ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు , సంబంధాలలో సమస్యలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇతర ముఖ్యమైన వాస్తు చిట్కాలు:
పైకి పెరిగేలా చూసుకోండి: మనీ ప్లాంట్ తీగలు ఎల్లప్పుడూ పైకి పెరిగేలా చూసుకోవాలి. అవి కిందకు వేలాడేలా వదిలేయకూడదు. తీగలు పైకి పాకేలా కర్ర లేదా తీగ సహాయంతో ఆధారం ఇవ్వండి. తీగలు పైకి పెరిగితే అభివృద్ధి, పురోగతికి చిహ్నంగా భావిస్తారు.
ఆరోగ్యకరమైన మొక్కను ఎంచుకోండి: మొక్క ఎప్పుడూ ఆరోగ్యంగా.. పచ్చగా ఉండాలి. పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన లేదా దెబ్బతిన్న ఆకులను వెంటనే తొలగించండి. అనారోగ్యకరమైన మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.
బెడ్‌రూంలో వద్దు: మనీ ప్లాంట్‌ను బెడ్‌రూంలో ఉంచకూడదు. దీనివల్ల దంపతుల మధ్య విభేదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. కిచెన్‌లో కూడా ఉంచడం మంచిది కాదు.
Also Read: శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు మీ సొంతం
పడకగది నుంచి దూరంగా: మనీ ప్లాంట్ మీ పడకగదికి తలుపు లేదా కిటికీకి ఎదురుగా ఉండకుండా చూసుకోండి.
బాత్రూం నుంచి దూరంగా: మనీ ప్లాంట్‌ను బాత్రూంలలో ఉంచడం నివారించాలి. బాత్రూంలు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఇది మొక్క యొక్క సానుకూల ప్రభావాలను తగ్గిస్తుంది.
పొడి నేల: మొక్కకు తగినంత నీరు పోసి మట్టిని ఎండిపోకుండా చూసుకోండి. పొడి మట్టి ప్రతికూలతకు సంకేతం.
డబ్బు ఉన్న చోట ఉంచండి: మీరు డబ్బు, నగలు లేదా విలువైన వస్తువులను ఉంచే ప్రదేశాలకు దగ్గరగా మనీ ప్లాంట్‌ను ఉంచడం శుభప్రదం.
ఇతరులకు ఇవ్వకూడదు: వాస్తు ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న సంపద తగ్గుతుందని నమ్ముతారు.
మొదటిసారి మనీ ప్లాంట్‌ను నాటినప్పుడు ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీరు దాని సౌందర్య ప్రయోజనాలతో పాటు.. ఇంటికి అదృష్టం, శ్రేయస్సు, సానుకూలతను తీసుకువస్తుంది.