
Divine Power :హిందూమతంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేవతల్ని పూజ చేసేటప్పుడు దీపారాధన చేస్తుంటారు. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించి పూజ నిర్వహిస్తుంటారు. దీపం ఇస్తే వచ్చే కాంతి, పొగ కూడా ఇంటికి.. అలాగే పర్యావరణానికీ మేలు చేస్తుంది. ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని నమ్ముతుంటారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పదార్ధాలతో దీపాలు వెలిగించడం వల్ల దైవ శక్తి పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దీపం ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతుంటే ఇంట్లో దేవతలు ఉన్నట్టే లెక్కగా చెబుతారు. గాలి లేకపోయినా ఒకవేళ ఆ దీపం ఇటు అటు ఊగుతూ ఉంటే లేనట్టేనంటారు. సాయంత్రం పూట ఇంట్లో పెట్టే దీపం వల్ల లక్ష్మీదేవి గృహంలోకి అడుగుపెడుతుంది. దీపం వెలుగుతూ ఉండే ఇంట్లో దేవతలు కొలువై ఉంటారట.
ఇంట్లో పాలు పొంగితే కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతోందని సంకేతం. దైవశక్తి ఉన్న గృహంలో కష్టాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని అనిపిస్తే దీపారాధన చేస్తే ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. రెండు లవంగాలు దీపంలో వేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ధనాదాయం పెరిగితే దైవశక్తి ఉందని భావించాలి. లవంగ దీపారాధన వల్ల ఆకర్షణా శక్తి పెరిగి నట్టింట్లోకి ధన లక్ష్మీ వస్తుందని నమ్మకం.
ఇంట్లో రెండు పూటలా.. లేదా ఒక్కపూటైనా దీపారాధన చేయగలుగుతున్నామంటే దైవశక్తి ఉన్నట్టుగా పరిగణించాలి. అది కూడా చేయలేకపోతున్నామంటే నెగిటివ్ ఎనర్జీతో ఇల్లంతా నిండినట్టుగా గుర్తించాలి. నివసిస్తున్న ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పూజ ముందు వాతావరణం బాగుంటే చేసే పూజా ఫలితం కూడా అలానే ఉంటుంది. ఇంటికి వచ్చే అతిథులను ప్రేమగా ఆహ్వానించే పరిస్థితులు ఇంట్లో ఉండాలి. అలాంటి బుద్ధి మనకి కలగాలంటే దైవశక్తి తోడుగా ఉండాలి. మంచి వాసనతో పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో దేవీ దేవతలు ఉంటారు . ఇంటితోపాటు వ్యక్తిగత శుభత్ర కూడా ముఖ్యమే.