BigTV English

Ravichandran Ashwin : ట్విటర్‌లో వార్.. అశ్విన్ వర్సెస్ జర్నలిస్ట్..

Ravichandran Ashwin : ట్విటర్‌లో వార్.. అశ్విన్ వర్సెస్ జర్నలిస్ట్..
Ravichandran Ashwin


Ravichandran Ashwin : టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు కాంట్రవర్సీలకు భయపడకుండా మనసులోని మాటలను బయటపెట్టేస్తారు. తాము మాట్లాడేది కాంట్రవర్సీకి దారితీస్తుందేమో అన్న భయం వారికి ఉండదు. అలా మనుసుకు అనిపించే మాట్లాడే ప్లేయర్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ 2023 మ్యాచ్‌లపై అశ్విన్ వేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతుండగా.. జానీ బెయిర్‌స్టో విషయంలో ఒక జర్నలిస్ట్‌తో వాగ్వాదానికి దిగాడు ఈ క్రికెటర్.

తాజాగా జరిగిన యాషెస్ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టోను తొలగించారు. ఆ విషయంలో అశ్విన్ స్పందించాడు. బెయిర్‌స్టోను తొలగింపు కరెక్టే అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. తను చేసింది తప్పు అన్నట్టుగా అశ్విన్.. తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. అయితే అశ్విన్ చేసిన ట్వీట్.. రాజ్‌దీప్ సర్దేశాయ్ అనే జర్నలిస్ట్‌కు నచ్చలేదు. దీంతో తనతో మాటల యుద్ధానికి దిగాడు. మీకు ఇలాగే చేస్తే ఊరుకుంటారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. అదే రియల్ టెస్ట్ అంటూ వ్యాఖ్యానించాడు.


రాజ్‌దీప్ స్పందనను రవిచంద్రన్ అశ్విన్ ఎలా తిప్పికొడతాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ను తన నిరాశపరచలేదు. మీకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను చాలా నిరాశపడేవాడిని, చాలా నిరాశపడేవాడిని, అలా ఔట్ అయినందుకు నన్ను నేనే కొట్టుకునేవాడిని’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ జర్నలిస్ట్‌కు వ్యంగ్యంగా భలే రిప్లై ఇచ్చాడంటూ ఫ్యాన్స్ అశ్విన్‌ను ప్రశంసించడం మొదలుపెట్టారు.

చాలామంది నెటిజన్లు.. ట్విటర్‌లో అశ్విన్‌ను సపోర్ట్ చేస్తూ.. ఆ జర్నలిస్ట్ వ్యాఖ్యలకు సరైన కౌంటర్స్ వేశారు. ఇక యాషెస్ 2023 విషయానికొస్తే రెండో టెస్ట్‌ను కూడా ఆస్ట్రేలియానే గెలిచి లీడ్‌లోకి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియాతో తలబడుతున్న ఇంగ్లాండ్.. క్లీన్ స్పీప్ అవ్వకూడదని కోరుకుంటోంది. థర్డ్ టెస్ట్‌తో అయినా ఆస్ట్రేలియాను ఓడించాలని అనుకుటోంది.

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×