BigTV English

Planets For Happy Life: ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉంటే జీవితమంతా సంతోషమయం

Planets For Happy Life: ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉంటే జీవితమంతా సంతోషమయం

Planets For Happy Life: గ్రహాలు మీ జాతకంలో శుభ స్థానంలో ఉంటే జీవితమంతా సంతోషంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవించాలని కోరుకుంటారు. కెరీర్‌లో విజయం, వ్యక్తిగత ఆనందం పొందాలని అనుకుంటారు. అందుకు అనుగుణంగానే కృషి చేస్తారు. కానీ కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ వారు కోరుకున్న విజయాలను చేరుకోవడంలో విఫలం అవుతుంటారు.
జాతకంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటానికి గ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి.


గ్రహాల స్థానం సరిగా లేకపోతే ఒక వ్యక్తి పేదవాడిగా మారే అవకాశం ఉంటుంది. సరైన స్థానంలో ఉంటే రాజుగా మారతాడు. ఏ గ్రహాలు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే విజయం, పురోగతి, ఆనందం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కెరీర్ కోసం:
బృహస్పతిని దేవతల గురువుగా కొలుస్తారు. కెరీర్‌లో పురోగతికి బృహస్పతి ముఖ్య పాత్ర పోషిస్తాడు. బృహస్పతి ధనస్సు, మీనరాశులను పాలిస్తాడు. జ్ఞానం, విద్య, సంతానం,సంపద వృద్ధి,మతపరమైన కార్యకలాపాలకు బృహస్పతి కారకుడిగా ఉంటాడు. కెరీర్ లో పురోగతి కోసం జాతకంలో బృహస్పతి బలంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే బృహస్పతిని అదృష్టం ఇచ్చే గ్రహంగా పిలుస్తారు. జాతకంలో గురు స్థానం బలంగా ఉంటే ఉద్యోగంలో గణనీయమైన పురోగతి లభిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి పదవ ఇంట్లో ఉంటే అతడికి అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది
విజయం కోసం:
సూర్యభగవానుడు శక్తిని ప్రసాదిస్తాడు. ప్రపంచం మొత్తానికి జీవనాధారం సూర్యుడు. సామాజిక గౌరవంతో పాటు వ్యక్తిని ఉన్నత స్థానంలో సూర్యుడు ఉంచుతాడు. ఒక వ్యక్తి నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాడు. సింహరాశిని సూర్యుడు పరిపాలిస్తాడు. తులా రాశిలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. కెరీర్లో పురోగతి, విజయాన్ని అందించే జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉండటం చాలా అవసరం. పనిలో విజయం సాధించడానికి అనుకున్న వారు తప్పనిసరిగా సూర్యభగవానుని ఆదరించడం మంచిది. ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ప్రతిరోజూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది.
సంతోషంగా ఉంచే గ్రహాలు:
శని, సూర్యుడి కుమారుడు. జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. దుఖం, వ్యాధులు, కష్టాలు సంతోషాన్ని శని ప్రసాదిస్తాడు. మకర, కుంభ రాశులకు అధిపతి శని. శని స్థానంతో పాటు ఒక వ్యక్తి ఆనందాన్ని ప్రభావితం చేయడంలో ఇతర గ్రహాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ధైర్యం, బలాన్ని ఇచ్చేది కుజుడు. నీడగ్రహాలైన రాహుకేతువులు కూడా వ్యక్తి సంతోషం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నాలుగు గ్రహాలు కలిసి ఒకే ఇంట్లో ఉంటే వారి జీవితంలో విభేదాలు కలుగుతాయి.

Also Read: శని సంచారంతో రెండు నెలల్లో ఈ రాశి వారికి జాక్ పాట్..


జీవితంలో ఆనందాన్ని కొనసాగించేందుకు ఈ గ్రహాలకు కోపం రాకుండా చూసుకోవాలి. అప్పుడే జీవితంలో శాంతి, ఆనందం ఉంటాయి. గ్రహాలు మాత్రమే కాకుండా నక్షత్రాలు కూడా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జాతకంలో నక్షత్రం బలమైన లేదా అశుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో నిరాశ, చికాకు ఉంటుంది. అదే అనుకూలంగా ఉంటే శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది.

Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×