E-Paper
Advertisement

India Beat Zimbabwe: జింబాబ్వేతో చివరి టీ20లోనూ భారత్ విజయం

India Beat Zimbabwe: జింబాబ్వేతో చివరి టీ20లోనూ భారత్ విజయం
Advertisement

India Beat Zimbabwe by 42 Runs to Win Series 4-1: జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో జింబాబ్వేపై టీమిండియా గెలిచింది. జింబాబ్వేతో 5టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. 42 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి, 4-1 తేడాతో సిరీస్ ను ముగించింది. అయితే, ఇప్పటికే సిరీస్ టీమిండియా వశం కాగా, నామమాత్రపు ఐదో మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శనతో ఎంతగానో టీమిండియా ఆకట్టుకున్నది. తొలుత 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. ప్రత్యర్థిని 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది.

కాగా, లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ వెస్లీ(0) బౌల్డయ్యాడు. తొలి డౌన్ లో వచ్చిన బ్రియాన్ (10)తో కలిసి మరో ఓపెనర్ మరుమాణి (27) ఇన్నింగ్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మరుమాణి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ముకేశ్ బౌలింగ్ లో శివం దుబేకు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వారంతా కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివర్లో అక్రమ్ కాస్త ఫర్వాలేదనిపించాడు.

Advertisement

Also Read: ఆ టైమ్‌లో నన్ను ఎవరు గుర్తించలేదన్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు

భారత్ బౌలర్లు.. ముకేశ్ కుమారు 4 వికెట్లు తీయగా, శివం దుబే 2, తుషార్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

Tags

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×