BigTV English

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి, అదృష్టం అమాంతం పెరుగుతుంది

Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి, అదృష్టం అమాంతం పెరుగుతుంది

Vastu Tips: చాలా మందికి సహజ పచ్చదనం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటిని పచ్చగా మార్చుకోవడానికి ఇండోర్ మొక్కలను నాటడం ప్రారంభిస్తారు. పచ్చని మొక్కలు ఇంటిని ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా సానుకూల శక్తిని, అదృష్టాన్ని పెంచుతాయి. ఇది మాత్రమే కాదు, కొన్ని మొక్కలు ఆనందం, శ్రేయస్సు, సంపదను పెంచడంలో సహాయపడతాయని నమ్ముతారు. ఈ మొక్కలను సరైన దిశలో, సరైన స్థానంలో ఉంచినట్లయితే అది ఆర్థిక పురోగతికి కూడా దారితీస్తుంది. మీ సంపదను పెంచడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా పెంచే 5 మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. మనీ ప్లాంట్:
సాధారణంగా చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ పెంచుకోవడం చూసే ఉంటారు. ఇది ఇంట్లో సంపద పెరుగుటకు చిహ్నంగా పరిగణించబడుతుంది. శుక్ర గ్రహంతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉండటం వల్ల, దానిని ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదం అని చెబుతారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ మనీ ప్లాంట్ ఆకులు అస్సలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

2. వెదురు మొక్క:
వాస్తు , ఫెంగ్ షుయ్ ప్రకారం వెదురు మొక్కను అదృష్టం, శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. నీటితో నింపిన గాజు కూజాలో దీనిని ఎరుపు రిబ్బన్‌తో కట్టి ఉంచడం మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభం కోసం, దీనిని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం.


3. తులసి:
తులసిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిని లక్ష్మీ దేవి మరో రూపంగా చెబుతారు. ఇంటి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఈ చెట్టును నాటడం ద్వారా, ఇంట్లో ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయి. అంతే కాకుండా తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు అర్పించడం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇది ఆర్థిక శ్రేయస్సుకు దారితీస్తుంది.  అంతే కాకుండా ఇంట్లో తులసి చెట్టు పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు రాకుండా ఉంటాయి.

4. లిల్లీ:
లిల్లీ మొక్క దాని అందమైన పువ్వులు , మనోహరమైన సువాసన కారణంగా ఇంట్లో ఆనందం, శాంతిని తెస్తుందని నమ్ముతారు. దీనిని ఇంట్లో నాటడం ద్వారా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. ఆర్థిక శ్రేయస్సు కోసం, ఇంటి ఆగ్నేయ దిశలో తెల్లటి లిల్లీస్ ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: బృహస్పతి సంచారం.. ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్

5. జాడే ట్రీ :
చిన్న, గుండ్రని ఆకులు కలిగిన జాడే మొక్క (క్రాసులా) సంపద , అదృష్టాన్ని ఆకర్షిస్తుందని అంటారు. ఈ మొక్కను ఇల్లు లేదా ఆఫీసు ప్రవేశ ద్వారం ఉంచడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ మొక్క అయస్కాంతం లాగా సంపద , సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుతుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇండోర్ ప్లాంట్ లాగా దీనిని మీరు పెంచుకోవచ్చు. ఇది తక్కువ నీటితోనే పెరుగుతుంది. అంతే కాకుండా చూడటానికి అందంగా కూడా ఉంటుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×