Shahtoot fruit: సమ్మర్ సీజన్‌లో వచ్చే ముఖ్యమైన పండ్లలో షాతూట్ ఒకటి. దీనికి మరొక పేరు మల్బెర్రీస్ అని కూడా పిలుస్తారు. బాగా పడిన తర్వాత తింటే ఆ పండు చాలా తీపిగా ఉంటుంది. రెడ్ లేదా గ్రీన్ కలర్‌లో ఉన్న పండు లైటుగా పిలుపు, వగరు మిక్స్ చేసి ఉంటుంది. షాతూట్ పండు ఆరోగ్యానికి ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో హంగామా
ఈ మధ్యకాలం హైదరాబాద్‌లో మార్కెట్లో షాతూట్ పండ్లు విస్తారంగా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్డుకి ఇరువైపులా సైకిల్‌కి ఇరువైపులా కట్టి అమ్ముతున్నారు. మార్కెట్లో కేవలం కొద్దిరోజులు మాత్రమే కనిపిస్తుంది. ఇండియాలో పండు అయితే పొట్టిగా ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే సీడ్ అయితే కాస్త పొడువుగా ఉంటుంది. అన్నట్లు రుచిగా ఉంటుంది కూడా.
తెలుగులో షాతూట్ లేదా తూత పండు అని ముద్దుగా పిలుస్తారు. మామూలుగా నల్లటి లేదా ఎరుపటి రంగులో కనిపిస్తుంది. ఈ పండులో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పోషకాల గని షాతూట్
విటమిన్ C అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాల నుండి రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: 30 రోజుల్లోనే బరువు తగ్గడం ఎలాగో తెలుసా?
రక్తహీనతను నివారించడంలో కీలకంగా పని చేస్తుంది షాతూట్. ఐరన్ సమృద్ధిగా ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఎనీమియా ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
రకరకాల ప్రయోజనాలు
ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో సహకరిస్తుందని అంటున్నారు. చర్మం ఆరోగ్యంగా కాపాడడం, మొటిమలు తగ్గించడానికి సహకరిస్తుందని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే షాతూట్ పండు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. పోషకాలు ఉండడంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతి రోజు కొన్ని షాతూట్ తీసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు.
ఎండిన మల్బరీలను మఫిన్లు, కేకులు, కప్‌కేక్‌ల కోసం ఉపయోగించవచ్చు. స్వీట్ బ్రెడ్ తయారీకి వినియోగిస్తారు. ఇక సలాడ్‌లు, స్మూతీలను తయారు చేయడానికి ఈ పండును కొందరు ఉపయోగిస్తారు. జామ్‌లు, ప్రిజర్వ్‌లు, జామ్‌లను తయారు చేయడానికి కొందరు ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.