BigTV English

Corpse in Dream: కలలో శవం కనిపించిందా.. ? అయితే దాని అర్థం ఏంటో తెలుసా..?

Corpse in Dream: కలలో శవం కనిపించిందా.. ? అయితే దాని అర్థం ఏంటో తెలుసా..?

Corpse in Dream Do You Know What it Means: నిద్రలో కనిపించే కలలకు స్వప్న శాస్త్రం ప్రకారం రకరకాలు అర్థాలు ఉంటాయి. కొన్ని కలలు వలన శుభం జరిగితే.. మరికొన్ని కలల వలన అశుభం కలుగుతుందని ముందుగానే వీటి ద్వారా సంకేతాలు అందుతాయి. సాధారణంగా నిద్రలో చాలా కలలే వస్తాయి. కానీ వాటిలో చాలా శాతం మెలుకువ వచ్చే సరికి మరచిపోతాం. అయితే కలలో శవం కనిపిస్తే చాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం అలా కలలో శవం కనిపించడం అనేది శుభమో, అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం..


కల జ్యోతిష్యం: జ్యోతిష్యంలో కలలకు సంబంధించి ఓ ప్రత్యేక శాఖ ఉంది. ఈ శాస్త్రం ప్రకారం.. రాత్రి నిద్రలో కనిపించే కలలు భవిష్యత్ సంఘటనల గురించి మంచి, చెడు సూచనలను ఇస్తాయి. రాబోయే కాలం మీకు ఎలా ఉంటుందో ఈ కలలు తెలియజేస్తాయి. కలలకు అర్థాలు స్వప్న శాస్త్రంలో వివరించబడ్డాయి. కలలో శవాన్ని చూడడం లేదా కలలో మండుతున్న చితిని, శవపేటికను చూడడం వంటి వాటికి స్వప్న శాస్త్రం ప్రకారం అర్థాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..

కలలో శవపేటిక కనిపించడం: స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో శవ పేటిక కనిపించడం అంటే శుభం. అలాంటి కల మీ జీవితకాలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అకస్మాత్తుగా కొంత గొప్ప ఆనందం లేదా విజయాన్ని పొందవచ్చు.


కలలో చనిపోయినట్లు కనిపించడం: కలల శాస్త్రం ప్రకారం.. మీ కలలో చనిపోయినట్లు కనిపిస్తే అది శుభసూచికం. అలాంటి కల కంటే మీ సమస్యలు త్వరలో ముగుస్తాయి అని దాని అర్థం. అలాగే, మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.

కలలో పూర్వీకులను చూడటం: మీరు కలలో మరణించిన వ్యక్తిని చూస్తే, మీరు త్వరలో ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారని అర్థం. కలలో పూర్వీకులను చూడటం, వారి ఆశీర్వాదం పొందడం జీవితంలో గొప్ప ఆనందానికి సంకేతం. అలాంటి కల మీ రోజులు మారబోతున్నాయని చెబుతుంది.

Also Read: మీ కలలో పదే పదే పాములు కనిపిస్తున్నాయా? దాని అర్థం ఏంటో తెలుసా..?

కలలో చనిపోయిన వ్యక్తిని చూడటం: కలలో చనిపోయిన వ్యక్తిని చూడటం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తి దీర్ఘాయువు కలిగి ఉంటాడని చెబుతుంది. మీ కలలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చనిపోయినట్లు మీరు చూస్తే, అతను తన అనారోగ్యం నుంచి ఉపశమనం పొందబోతున్నాడని అర్థం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×