భారతదేశం.. దేవాలయాల భూమి. అడుగడుగున శివలింగాలు, ఎన్నో ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కొలిచే దేవుళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి దేవతకు ఎంతో కొంత స్థలం ప్రతి గ్రామంలో ఉంటుంది. ఒక్కో దేవాలయం ఒక్కో కోరికను తీర్చడంలో ప్రసిద్ధి చెందినదిగా చెప్పుకుంటారు. అలా ఇక్కడ మేము ప్రభుత్వ ఉద్యోగం ప్రసాదించే ఆలయం గురించి వివరించాము.
యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే, బ్యాంకింగ్… ఇలా ఎన్నో రకాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే అందులో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు వరిస్తాయి. అవిశ్రాంతంగా చదువుతూ గవర్నమెంట్ ఉద్యోగమే పరమావధిగా పెట్టుకున్న వారికి దైవ బలం కూడా కలిసి రావాలని నమ్ముతారు.
అలాంటి దైవ బలం మీకు కావాలనుకుంటే రాజస్థాన్లోని ‘అంతెలా గ్రామం’లో ఉన్న ఒక ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే కచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటారు. ముఖ్యంగా యూట్యూబ్లో ఈ ఆలయం గురించి ఎక్కువగా ప్రస్తావనా వస్తోంది. కొంతమంది యూట్యూబ్లో ఈ ఆలయం గురించి వివరిస్తూ వీడియోలు చేశారు.
ఇదే ఆ ఆలయం
పవన్ గుప్తా అనే యూట్యూబర్ రాజస్థాన్లోని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే ఆలయం గురించి ఒక అందమైన వీడియోను పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వ్యక్తులు ఈ ఆలయానికి వచ్చి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. ఈ ఆలయాన్ని ‘అంతెల కుండ ధామ్’ అని పిలుస్తారు.
ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఇళ్లు ఉన్నాయి. ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం పుకారు అనుకోకండి. గ్రామస్తులకు ఇది గర్వకారణంగా మారుతుంది. ఉపాధ్యాయుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ ఊరిలో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వ్యక్తులు ఏదో ఒక రూపంలో విజయాన్ని సాధిస్తారని మాత్రం చెప్పుకుంటారు.
జాతకానికి దైవసహాయం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి చదువుతున్న వ్యక్తులకి ఇలా ఆలయాలు సందర్శించాల్సిన అవసరం ఏముంది? అనుకుంటారు ఎంతోమంది. కానీ కష్టానికి అదృష్టం తోడవ్వాలని పురాణాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే జాతకం అందరికీ ఉండదు. అలాంటి జాతకాన్ని బలపరుచుకోవాలంటే దైవ సహాయం కూడా అత్యవసరం.
అలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే ఒక అద్భుతమైన ఆలయం అంతెలా కుండ ధామ్. మీరు రాజస్థాన్ సందర్శించాలనుకున్నప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించేందుకు ప్రయత్నించండి. మీకు ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేకపోయినా ఒక అద్భుతమైన ఆలయాన్ని సందర్శించామన్న అనుభూతి కోసం అయినా చూడండి. ఇక ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారు… ఒకసారి రాజస్థాన్లోని ఈ ఆలయానికి వెళ్లి రండి. ఆ దైవ సహాయంతో మీరు ఈసారి ఉద్యోగాన్ని పొందవచ్చేమో… ప్రయత్నించండి.