AAICLAS: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టులు, వెకెన్సీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు తేదీల గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(AAICLAS) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ఖాళీగా ఉన్న అసిస్టెంట్ (సెక్యూరీటీ) పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 166
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
అసిస్టెంట్ (సెక్యూరిటీ): 166 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బోర్డు, ఇన్‌స్టిట్యూషన్ నుంచి జనరల్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 60, 55 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషలోరాయడం, చదవడం వచ్చి ఉండాలి.
వయస్సు: 2025 జూన్ 1వ తేది నాటికి 27 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.21,000 నుంచి రూ.22,500 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 9
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30
దరఖాస్తు ఫీజు: జననరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://aaiclas.aero/
ALSO READ: NTPC Limited: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. తక్కువ కాంపిటేషన్.. జీతమైతే రూ.2లక్షలు భయ్యా
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 166
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30