BigTV English

UPSC Notification: భారీ శుభవార్త.. యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇంకా వారమే ఛాన్స్

UPSC Notification: భారీ శుభవార్త.. యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇంకా వారమే ఛాన్స్

UPSC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది.అర్హత ఉన్న అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగీ లేదా బీటెక్ లేదా పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నుంచి పలు విభాగాల్లో 493 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్‌ 12న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 493


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌‌లో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో లీగల్ ఆఫీసర్ (గ్రేడ్-1), ఆపరేషన్స్ ఆఫీసర్, సైంటిఫికి ఆఫీసర్, అసోసియేట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్, ట్రాన్స్ లేటర్, తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – ఖాళీలు:

లీగల్ ఆఫీసర్‌(గ్రేడ్‌-1): 02
ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 121
సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 12
సైంటింస్ట్‌-బీ(మెకానికల్): 01
అసోసియేట్‌ ప్రొఫెసర్‌(సివిల్‌): 02
అసోసియేట్‌ ప్రొఫెసర్‌(మెకానికల్): 01
సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 03
జూనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌: 24
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01
జూనియర్‌ టెక్నికల్ ఆఫీసర్‌: 05
ప్రిన్సిపల్‌ సివిల్ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 01
ప్రిన్సిపల్‌ డిజైన్‌ ఆఫీసర్‌: 01
రీసెర్చ్‌ ఆఫీసర్‌: 01
ట్రాన్స్‌ లేటర్‌: 02
అసిస్టెంట్ లీగల్‌ అడ్వైజర్‌: 05
అసిస్టెంట్ డైరెక్టర్‌(ఆఫీషియల్‌ లాంగ్వేజ్‌): 17
డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌: 20
పబ్లిక్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3: 18
స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3: 122
ట్రైనింగ్‌ ఆఫీసర్‌: 94
అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌: 02
అసిస్టింట్ ఇంజినీర్‌: 05
సైంటిస్ట్‌-బి: 06
డిప్యూటీ డైరెక్టర్‌: 02
అసిస్టెంట్ కంట్రోలర్‌: 05
స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3(రేడియో డయాగ్నోసిస్‌): 21

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా బీటెక్, ఎల్‌ఎల్‌బీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 12

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.25 మాత్రమే ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

ALSO READ: AAICLAS: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్‌తో ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 493

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 12

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×