E-Paper
Advertisement

Clothes and Sandals : ఇతరులు వాడిన బట్టలు, చెప్పులు వేసుకుంటే నష్టం తప్పదా…

Clothes and Sandals : ఇతరులు వాడిన బట్టలు, చెప్పులు వేసుకుంటే నష్టం తప్పదా…
Advertisement

Clothes and Sandals : ఇంట్లో ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడేస్తూ ఉంటారు. ముఖ్యంగా

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒకరి బట్టలు ఒకరి, చెప్పులు కూడా వాడటం మనం

Advertisement

చూస్తుంటాం. ఇందులో తప్పేమీ లేదని కొందరూ కొట్టిపారేస్తుంటారు. వాస్తు శాస్త్రం

ప్రకారం ఇతరుల వద్ద నుంచి తీసుకోకూడని వస్తువుల విషయానికి వస్తే, ఇతరుల

Advertisement

వద్ద నుండి బట్టలు ఎప్పుడు తీసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఒకరు వేసుకున్న బట్టలు మరొకరు వేసుకుంటా వారి ప్రభావం వేసుకున్న వారిపై

వస్తుంది. మనం వేసుకుంటే బట్టలు శరీరానికి దగ్గరగా ఉంటాయి. మన శరీరం నుంచి

వెలువడే భావ స్పందనలు ఆ వస్త్రాల నుంచి వస్తుంది. అందుకే పోలీసు జాగిలాలు

అంటే డాగ్ స్వాడ్స్ లో బట్ట ముక్కని వాసన చూపించి దొంగల్ని, నేరస్థులు

పట్టుకునేందుకు ఉపయోగిస్తుంటారు. మన శరీరం నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన

బట్టలు వేసుకుని వారిపైకి వెళ్తాయి. అంటే మంచైనా, చెడైనా వారికి బదిలీ అవుతాయి.

మహానుభావులు, పెద్దోళ్లవి వేసుకుంటే పర్వాలేదు. మంచి స్వభావం మంచి

ఆలోచనలు ఉన్న వారి బట్టలు వేసుకుంటే నష్టం జరగకపోవచ్చు. అదే దురాలోచన

ఉన్న వారి వస్త్రాలు ధరిస్తే మనకు కూడా అంతో ఇంతో అలాంటి ఆలోచనలే

కలుగుతాయి. ఆ బట్టలు వేసుకున్న వాళ్లు మానసికంగా ధృడంగా ఉన్నట్లయితే

పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కాని వారు బలహీనులైతే ఆ చెడు ప్రభావానికి

గురవుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పూర్వకాలంలో ఒకరి బట్టలు ఒకరు వాడద్దని

చెప్పేవారు. పొరపాటున వేసుకుంటే వెంటనే మార్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ల

వస్తువులు, బట్టలు ఒకరివి ఒకరు వాడినా పర్వాలేదు. కాని బయట వారివి అసలు

వాడరాదు.

రక్తసంబంధీకులవి వాడినా ఎలాంటి నష్టం జరగదు. కానీ ఇతరులవి

వేసుకునేటప్పుడు చాలా ఆలోచించాలి.అలాగే ఇతరుల వద్ద నుండి తీసుకోకూడనివి

బూట్లు లేదా చెప్పులు. ఇతరుల బూట్లు లేదా చెప్పులు ధరించడం వల్ల ఖచ్చితంగా

ఇంట్లో పేదరికం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇతరుల చెప్పులు

ధరిస్తే, ఖచ్చితంగా వారి శని మనకు పడుతుందని చెబుతున్నారు. అందుకే

పొరపాటున కూడా ఎప్పుడూ ఇతరుల చెప్పులు లేదా బూట్లు వేసుకోకూడదని

సూచిస్తున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×