BigTV English

Sindhuram : సింధూరం పెట్టుకుంటే గ్రహబాధలు పోయినట్టే!

Sindhuram : సింధూరం పెట్టుకుంటే గ్రహబాధలు పోయినట్టే!

Sindhuram : రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట. ఆ మాట హనుమంతుడు ఒంటినిండా సింధూరం పూసుకున్నాడు. తమ స్వామి క్షేమం కోరుతూ అలా చేశానని సెలవిచ్చాడు.


ఏదైనా ఇంట్లో నిత్యం కలహాలు జరుగుతు ఉంటే అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. నిత్యంలో ఇంట్లో భయం, భయం బతుకూ ఉంటాయో వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది. ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగ బాధలు దరి చేరవు.

వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు పుడతారు. విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. బీపీ ఉన్నవారు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.ఆంజనేయస్వామికి సింధూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది.


Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×